Suicide Deaths in Full Moon:
ఆసక్తికర అధ్యయనం..
లవ్‌లో ఫెయిల్ అయ్యామనో, లైఫ్‌లో సక్సెస్ రావడం లేదనో, పరీక్షలు సరిగా రాయలేదనో..ఇలా కారణమేదైనా అది ఆత్మహత్యలకు దారి తీస్తోంది. ఈ మధ్య కాలంలో బలవన్మరణాలు ఎక్కువైపోయాయి. మరీ చిన్న చిన్న కారణాలకూ ప్రాణాలు తీసుకుంటున్న వాళ్లూ ఉన్నారు. చావొక్కటే పరిష్కారం అని బలంగా నమ్ముతున్నారు. సూసైడ్ చేసుకుంటున్నారు. వీటిని అరికట్టడానికి ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ప్రయత్నిస్తూనే ఉన్నా..పెద్దగా మార్పు కనిపించడం లేదు. అసలు ఆత్మహత్య చేసుకోవాలని ఎందుకు అనిపిస్తుంది..? ఆ సిచ్యుయేషన్‌లో వాళ్ల స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుంది..? వీటికి ఒక్కొక్కరూ ఒక్కో అనాలసిస్ చెబుతారు. కానీ...ఈ మధ్యే ఓ ఇంట్రెస్టింగ్ స్టడీ ఒకటి ఆత్మహత్యలకు సంబంధించి అనూహ్య విషయాలు వెల్లడించింది. నిండు పున్నమి రోజునే ఎక్కువగా ఆత్మహత్యలు జరుగుతున్నాయని చెప్పింది. సాధారణంగా పౌర్ణమి రోజున మన బాడీలో ఎన్నో మార్పులు జరుగుతాయని పూర్వీకులు చెప్పే వాళ్లు. శతాబ్దాలుగా ఈ నమ్మకం బలపడిపోయింది. ఇప్పుడు కొత్తగా ఓ స్టడీ కూడా ఇదే చెబుతోంది. అంతే కాదు. మధ్యాహ్నం పూట ఎక్కువ సూసైడ్స్ రికార్డ్ అవుతున్నాయని తెలిపింది. ఏడాది మొత్తంలో సెప్టెంబర్‌లోనే ఎక్కువ మంది సూసైడ్ చేసుకుంటున్న మరో ఆసక్తికర విషయం వెల్లడించింది.
ఇండియానా యూనివర్సిటీ స్టడీ
ఇండియానా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఇటీవలే Discover Mental Health పేరిట ఓ జర్నల్ విడుదల చేసింది. అందులోనే ఈ ఇంట్రెస్టింగ్ డిటెయిల్స్ కనిపించాయి. ఈ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ అలెగ్జాండర్ తన టీమ్‌తో కలిసి ఈ అధ్యయనం చేశారు. 2012-16 మధ్య కాలంలో జరిగిన ఆత్మహత్యల డేటాను సేకరించారు. 55 ఏళ్లు పైబడిన వాళ్లు శుక్లపక్షం (Full Moon)లోనే ఎక్కువగా ఆత్మహత్యకు పాల్పడినట్టు తేల్చారు. ఇక సాయంత్రం సూసైడ్స్ ఎక్కువగా నమోదైనట్టు గుర్తించారు. ముఖ్యంగా 3-4 గంటల మధ్యలో ఆత్మహత్యలకు "పీక్ టైమ్‌గా" వెల్లడించారు. హైరిస్క్ పేషెంట్స్‌ను ఈ సమయంలో ఓ కంట కనిపెడుతూ ఉండాలని సూచించారు. లైటింగ్‌లో మార్పుల కారణంగా బాడీలోనూ మార్పులు వస్తాయని వెల్లడించింది ఈ టీమ్. ముఖ్యంగా డిప్రెషన్‌తో బాధ పడే వారితో పాటు మద్యానికి బానిసైన వాళ్ల శరీరాల్లో స్ట్రెస్ డిసార్డర్ పెరుగుతుందని స్పష్టం చేసింది.
సాయంత్రం 3-4 గంటల మధ్యే
సాయంత్రం 3-4 గంటల మధ్యే ఎందుకు ఎక్కువగా సూసైడ్స్ జరుగుతున్నాయో కూడా వివరించింది. సరిగ్గా ఆ సమయానికే వెలుతురు తగ్గిపోయి చీకటి పడుతూ ఉంటుంది. వాతావరణ మార్పులకు అనుగుణంగా మన మెదడులోని Circadian Clockలో మార్పులు వస్తుంటాయి. ఎప్పుడైతే వెలుతురు తగ్గిపోతుందో...డిప్రెషన్‌లో ఉన్న వాళ్లకు నెగటివ్ థాట్స్ మొదలవుతాయి. స్ట్రెస్ హార్మోన్‌లు యాక్టివ్ అవుతాయి. అందుకే ఆత్మహత్యకు పాల్పడతారని ఈ స్టడీ వెల్లడించింది. ఇక వానాకాలంలో ఎక్కువ శాతం చీకటిగానే ఉంటుంది. అందుకే సెప్టెంబర్ నెలలో ఎక్కువగా సూసైడ్స్ రికార్డ్ అవుతున్నట్టు వివరించింది. రాత్రి పూట ఎక్కువగా మొబైల్ స్క్రీన్‌ను చూస్తూ గడిపే వాళ్లకూ సూసైడ్ థాట్స్ ఎక్కువగా వస్తున్నట్టు మరో సంచలన విషయమూ చెప్పింది ఈ అధ్యయనం.
Also Read: Viral News: టాయిలెట్‌లో 7 అడుగుల మొసలి, భయంతో వణికిపోయిన గ్రామస్థులు