Vijay Vs Tamilnadu : సీఎంగా కరుణానిధి ఉన్నప్పుడు స్టాలిన్‌ను ఉపముఖ్యమంత్రిగా నియమించారు. అప్పటికే  కలైజ్ఞర్ ఇంట్లో వారసత్వ పోరు నడుస్తోంది. అయినా స్టాలిన్‌కే డిప్యూటీ సీఎం పోస్టు ఇచ్చారు. అప్పట్నుంచి స్టాలిన్ పార్టీపై పట్టు సాధించి అసలైన వారసుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు తన కుమారుడు ఉదయనిధి కూడా అలాంగే వారసత్వాన్ని స్టాలిన్ ఇచ్చారు. డిప్యూటీ సీఎంగా నియమించారు. ఇక ముందు పూర్తిగా డీఎంకే రాజకీయాలు ఉదయనిధి కేంద్రంగా జరుగుతాయని చాలా మంది ఓ నిర్ణయానికి వచ్చారు. 


ఇప్పటికే పార్టీపై పట్టు సాధించిన ఉదయనిధి 


సినీ నిర్మాతగా, హీరోగా తమిళ సినీ పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్న ఉదయనిధి తాత, తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని రాజకీయాల్లోకి వచ్చారు. మొదట డీఎంకే యువత విభాగాన్ని తన చేతుల మీదుగా నడిపించారు. గత ఎన్నికల్లో అసెంబ్లీకి ఎన్నికయ్యారు.  మంత్రి పదవి కూడా దక్కింది. ఇప్పుడు ఏకంగా డిప్యూటీ సీఎం పోస్టు ఇచ్చారు. అంటే తన వారసుడిగా ఉదయనిధిని స్టాలిన్ అనధికారికంగా ఖరారు చేసినట్లే. స్టాలిన్‌కు ఇప్పటికే వయసు 70 దాటిపోయింది. అందుకే పార్టీ కోసం విస్తృతంగా ఉదయనిధినే పర్యటిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని  కూడా పూర్తి స్థాయిలో ఉదయనిధినే తన భుజాలపై మోశారు.  


సిక్ ‌లీవులు పెడితే ఇంటికి మేనేజర్లు - టెస్లా ఉద్యోగులను రాచి రంపాన పెడుతున్న ఎలన్ మస్క్


విజయ్‌కు పోటీగా ఉదయనిధి 


అయితే ఇంత హఠాత్తుగా ఎందుకు నిర్ణయం తీసుకున్నారన్నది తమిళనాడు రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చకు కారణం అవుతోంది. కొత్త పార్టీతో తెరపైకి వస్తున్న విజయ్‌కు సీనియర్ అయిన స్టాలిన్ పోటీ కాదని ఉదయనిధి మాత్రమే పోటీ అనే సంకేతాలను పంపినట్లు అయిందని చెబుతున్నారు. విజయ్ కు సినీ గ్లామర్ ఎక్కువ. మంచి క్రేజ్ ఉంది. కానీ ఎన్నికల్లో ఓట్లుగా మారుతాయా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. స్టాలిన్  దిగ్గజ నాయకుడిగా ఉన్నారు. తమిళనాడులో స్టాలిన్‌కు ప్రస్తుతం పోటీ లేదు. ఇప్పుడు జనాకర్షణలో విజయ్ ముందుకు వస్తారు . అయితే విజయ్ తో స్టాలిన్ పోటీ అంటే.. అనూహ్యంగా విజయ్ స్థాయిని పెంచినట్లే అవుతంది. ఈ దిశగా ఆలోచించి.. విజయ్ కు ఉదయనిధి సరిపోతారని ఆయనను మెల్లగా హైలెట్ చేస్తున్నారని డీఎంకే వర్గాలు చెబుతున్నాయి. 


టప్పర్‌వేర్ కంపెనీ ఎందుకు దివాలా తీసింది ? నోకియాలాగే మార్పును అందుకోలేకపోయిదా?


ఇద్దరూ హీరోలే - రాజకీయాల్లో ఎవరిది  పైచేయి ?                                      


దళపతి విజయ్ సీనియర్ హీరో. ఆయనకు అసంఖ్యాకమైన అభిమానులు ఉన్నారు. ఉదయనిధి స్టాలిన్‌కు రాజకయంగా ఫాలోయింగ్ ఉంది. సినిమాల్లోనూ ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు.కానీ విజయ్ లాగా మాస్ ఇమేజ్ వచ్చే సినిమాలు చేయలేదు. కానీ అనుచరులకు మాత్రం లోటు లేదు . అందుకే తమిళనాడులో వచ్చే రాజకయం అంతా ఈ ఇద్దరి మధ్య హోరాహోరీ పోరుతోనే ఉంటుందని అంచనా వేస్తున్నారు.