South Central Railway has made key announcements regarding trains: తీవ్ర తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రైల్వే ట్రాక్‌లు, సిగ్నలింగ్ వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడింది. దీని కారణంగా దక్షిణ మధ్య రైల్వే రైళ్ల షెడ్యూల్‌లో ముఖ్యమైన మార్పులు ప్రకటించింది. రైళ్ల క్యాన్సిలేషన్‌లు, డైవర్షన్ రూట్లు, రీషెడ్యూలింగ్‌లు ప్రకటించారు. ప్రయాణికులు టికెట్లను రద్దు చేసుకోవడానికి లేదా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడానికి రైల్వే అధికారులు అవకాశం కల్పించారు.
తుఫాను కారణంగా రెండు ముఖ్య రైళ్లను పూర్తిగా క్యాన్సిల్ చేశారు.
1. ట్రైన్ నెం. 22204 సికింద్రాబాద్-విశాఖపట్నం దురంతో ఎక్స్‌ప్రెస్: అక్టోబర్ 29, 2025న సికింద్రాబాద్ నుంచి బయలుదేరాల్సిన ఈ రైలు పూర్తిగా క్యాన్సిల్ చేశారు. ఈ రైలు సాధారణంగా విశాఖపట్నం వరకు సూపర్‌ఫాస్ట్ సర్వీస్‌ను అందిస్తుంది.
2. ట్రైన్ నెం. 12703 హౌరా-సికింద్రాబాద్ ఫలక్నుమా ఎక్స్‌ప్రెస్: అక్టోబర్ 30, 2025న హౌరా నుంచి బయలుదేరాల్సిన ఈ రైలు కూడా క్యాన్సిల్ అయింది. ఈ రైలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కనెక్టివిటీకి కీలకమైనది.
డైవర్షన్ రూట్లు: మూడు రైళ్లు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణంప్రభావిత ప్రాంతాల నుంచి వెళ్లే అవకాశం లేకపోవడంతో రైళ్లను ప్రత్యామ్నాయ రూట్లలో నడుపుతున్నారు. ఇందులో కొన్ని స్టేషన్లలో ఆగకుండా ప్రయాణం చేస్తాయి.
1. ట్రైన్ నెం. 20833 విశాఖపట్నం-సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్: అక్టోబర్ 29, 2025న విశాఖపట్నం నుంచి బయలుదేరే ఈ రైలు విజయవాడ, గుంటూరు, పగిడిపల్లి రూట్‌లో డైవర్ట్ అవుతుంది. వరంగల్ స్టేషన్‌లో ఆగకుండా ప్రయాణం చేస్తుంది.
2. ట్రైన్ నెం. 11019 ముంబై సిఎస్‌టీ-భువనేశ్వర్ కోణార్క్ ఎక్స్‌ప్రెస్: అక్టోబర్ 28, 2025న ముంబై సిఎస్‌టీ నుంచి బయలుదేరిన ఈ రైలు మహబూబాబాద్, కాజీపేట, పగిడిపల్లి, భువనగిరి , గుంటూరు, విజయవాడ రూట్‌లో డైవర్ట్ అవుతుంది. ఖమ్మం, మధిర స్టేషన్లలో ఆగకుండా ముందుకు వెళ్తుంది.
3. ట్రైన్ నెం. 18046 చర్లపల్లి-శాలిమార్ ఎక్స్‌ప్రెస్: అక్టోబర్ 29, 2025న చర్లపల్లి నుంచి బయలుదేరే ఈ రైలు వరంగల్, కాజీపేట, పగిడిపల్లి, భువనగిరి, గుంటూరు, విజయవాడ రూట్‌లో డైవర్ట్ అవుతుంది. మహబూబాబాద్, ఖమ్మం స్టేషన్లలో ఆగకుండా ప్రయాణం చేస్తుంది.
రీషెడ్యూలింగ్: వందే భారత్ రైలు షెడ్యూల్‌లో మార్పు చేసి, ఆలస్యంగా బయలుదేరేలా ఏర్పాటు చేశారు.
1. ట్రైన్ నెం. 20834 సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్: అక్టోబర్ 29, 2025న సికింద్రాబాద్ నుంచి బయలుదేరాల్సిన ఈ రైలు షెడ్యూల్డ్ టైం 15.00 గంటలకు బదులుగా 20.00 గంటలకు రీషెడ్యూల్ చేశారు.
# రైల్వే సలహా: ప్రయాణికులు జాగ్రత్తదక్షిణ మధ్య రైల్వే ప్రకటన ప్రకారం, ప్రయాణికులు IRCTC వెబ్‌సైట్ లేదా 139 హెల్ప్‌లైన్‌ను సంప్రదించి తాజా సమాచారం తెలుసుకోవాలని సూచించారు. క్యాన్సిల్డ్ రైళ్ల టికెట్లు పూర్తి రీఫండ్‌గా అందిస్తారు. తుఫాను ప్రభావం తగ్గిన తర్వాత మరిన్ని మార్పులు జరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఈ మార్పులు రైల్వే భద్రత, ప్రయాణికుల సురక్షితత్వం కోసం తీసుకున్న చర్యలు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో రైల్వే ట్రాక్‌లపై నీళ్లు నిలబడిపోవడం , ట్రాకులు కొట్టుకుపోవడం వంటివి జరిగాయి.ి ప్రభుత్వం, రైల్వే అధికారులు కలిసి పరిస్థితిని మానిటర్ చేస్తున్నారు.