2025 Tata Sierra Launch Date: టాటా మోటార్స్‌, తన లెజెండరీ SUVని మళ్లీ తీసుకురావడానికి సిద్ధమైంది. 2025 టాటా సియెరా, కొత్త వెర్షన్‌లో, నవంబర్‌ 25న అధికారికంగా లాంచ్‌ కానుంది. 1990లలో ఇండియన్‌ రోడ్లపై ప్రత్యేకమైన ఇమేజ్‌ సృష్టించిన ఈ SUV, ఇప్పుడు పూర్తిగా కొత్త రూపంలో రీ-ఎంట్రీ ఇవ్వబోతోంది.

Continues below advertisement


Hyundai Creta, Maruti Grand Vitara లెవల్‌లో కొత్త పోటీదారు
టాటా సియెరా... Tata Curvv, Tata Harrier మధ్యలో స్థానం సంపాదించబోతోంది. అంటే ఇది హ్యుందాయ్‌ క్రెటా, మారుతి గ్రాండ్‌ విటారా, హోండా ఎలివేట్‌ వంటి మిడ్‌-సైజ్‌ SUVలతో నేరుగా పోటీ పడనుంది. టాటా సియెరా ఎక్స్‌-షోరూమ్‌ ధర సుమారు ₹11 లక్షల నుంచి ప్రారంభమవుతుందని అంచనా. మొదట ICE వెర్షన్‌ (పెట్రోల్‌, డీజిల్‌) లాంచ్‌ అవుతుంది. ఆ తరువాత ఎలక్ట్రిక్‌ వెర్షన్‌ కూడా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.


1.5 లీటర్‌ TGDI ఇంజిన్‌ - సియెరాతో తొలి ప్రవేశం
టాటా తన సరికొత్త 1.5 లీటర్‌ టర్బో-పెట్రోల్‌ TGDI (టర్బో గ్యాస్‌ డైరెక్ట్‌ ఇంజెక్షన్‌) ఇంజిన్‌ను సియెరాలో మొదటిసారిగా అందించే అవకాశం ఉంది. ఇది 2023 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన ఇంజిన్‌. అలాగే ఎంట్రీ లెవల్‌ వేరియంట్లలో నేచురల్‌ ఆస్పిరేటెడ్‌ వెర్షన్‌ వచ్చే అవకాశం ఉంది.  సియెరా డీజిల్‌ లైనప్‌లో.. కర్వ్‌లో వాడిన 1.5 లీటర్‌ ఇంజిన్‌నే కొనసాగించవచ్చని సమాచారం.


ఎలక్ట్రిక్‌ వెర్షన్‌ - భవిష్యత్తు ప్రణాళిక
సియెరా EV గురించి ప్రస్తుతం వివరాలు క్లియర్‌గా లేకపోయినా, ఇది Hyundai Creta Electric, MG ZS EV, Mahindra BE 6 మోడళ్లకు పోటీగా రాబోతోంది. టాటా ఈ మోడల్‌లో బ్యాటరీ రేంజ్‌, ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సామర్థ్యాలను మెరుగుపరిచే అవకాశాలు ఉన్నాయి.


డిజైన్‌ - క్లాసిక్‌ సియెరాకు మోడర్న్‌ టచ్‌
1991 సియెరా మోడల్‌ను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని ఈ కొత్త SUVను టాటా పూర్తిగా ఆధునికంగా మలిచింది. కర్వ్‌డ్‌ రియర్‌ విండోస్‌, బాక్సీ వీల్‌ ఆర్చ్‌లు, ఎత్తైన బానెట్‌ వంటి పాత డిజైన్‌ ఎలిమెంట్స్‌ ఇందులో కొనసాగించారు. అయితే 2025 వెర్షన్‌లో 19 అంగుళాల అల్లాయ్‌ వీల్స్‌, స్లిమ్‌ హెడ్‌ల్యాంప్స్‌, కనెక్టెడ్‌ DRLs, మరింత షార్ప్‌ బాడీ లైన్స్‌ కనిపిస్తాయి.


ఫీచర్లు - 3 స్క్రీన్లు, ADAS, సన్‌రూఫ్‌
సియెరా కేబిన్‌లో మహీంద్రా XEV 9e తరహాలో మూడు స్క్రీన్లు ఉండనున్నాయి, అవి - డ్రైవర్‌ డిస్‌ప్లే, సెంటర్‌ టచ్‌స్క్రీన్‌, ప్యాసింజర్‌ స్క్రీన్‌. ప్రతి స్క్రీన్‌ సుమారు 12.3 అంగుళాలుగా ఉండొచ్చు.


ఇతర ఫీచర్లు: డ్యూయల్‌-టోన్‌ డాష్‌బోర్డ్‌, 4-స్పోక్‌ స్టీరింగ్‌ వీల్‌, ఆంబియంట్‌ లైటింగ్‌, పానోరామిక్‌ సన్‌రూఫ్‌, వైర్‌లెస్‌ ఛార్జర్‌, వెంటిలేటెడ్‌ సీట్లు.


భద్రత పరంగా 6 ఎయిర్‌బ్యాగ్స్‌, 360° కెమెరా, ESC, లెవల్‌ 2 ADAS ఉండనున్నాయి.


టాటా సియెరా రీఎంట్రీ అంటే కేవలం SUV మాత్రమే కాదు, ఒక నాస్టాల్జిక్‌ లెగసీ రిటర్న్‌గా చూడాలి. 90ల్లోని ఆ క్లాసిక్‌ డిజైన్‌కి ఇప్పుడు టెక్‌ టచ్‌ తో కొత్త లుక్‌ ఆపాదించారు. నవంబర్‌ 25న ఈ SUV లాంచ్‌ అయితే, మిడ్‌-సైజ్‌ SUV మార్కెట్లో స్టోరీ మారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.


ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.