Most Affordable Dual Channel ABS Bikes: సేఫ్టీ అంటే ఇప్పుడు బైక్‌ రైడర్లకు కేవలం ఆప్షన్‌ కాదు, అవసరం. ముఖ్యంగా ఇండియా లాంటి దేశంలో వెనుక బ్రేక్‌ ఎక్కువగా వాడే రైడర్లకు డ్యూయల్‌ ఛానల్‌ ABS తప్పనిసరి. ఈ టెక్నాలజీ వల్ల హార్డ్‌ బ్రేకింగ్‌ టైమ్‌లో చక్రాలు లాక్‌ కావడం తగ్గి, బైక్‌ కంట్రోల్‌ కోల్పోకుండా స్థిరంగా నిలబడుతుంది. ఇప్పుడు 160cc నుంచి 250cc వరకు, డ్యూయల్‌ ఛానల్‌ ABS సేఫ్టీ ఫీచర్‌తో లభించే అఫోర్డబుల్‌ బైకులు ఇవే...

Continues below advertisement

1. TVS Apache RTR 200 4V - ₹1.45 లక్షలు

TVS అపాచీ 200 4V ఎప్పటినుంచో ఫీచర్లతో ఫుల్‌గా ఉన్న బైక్‌. ఇందులో డ్యూయల్‌ ఛానల్‌ ABS, మూడు రైడింగ్‌ మోడ్‌లు, బ్లూటూత్‌ కనెక్టివిటీతో TFT డిస్‌ప్లే, ట్రాక్షన్‌ కంట్రోల్‌, క్రాష్‌ అలర్ట్‌ ఫీచర్‌ ఉన్నాయి. తాజాగా దీని ఫ్రంట్‌ ఎండ్‌ డిజైన్‌ను కూడా అప్‌డేట్‌ చేశారు.

Continues below advertisement

2. Bajaj Pulsar N250 - ₹1.33 లక్షలు

ఈ బైక్‌ 250cc ఆయిల్‌-కూల్డ్‌ ఇంజిన్‌తో పరుగులు తీస్తుంది. సిటీ రైడ్స్‌లో కంఫర్ట్‌గా ఉండేలా ఈ ఇంజిన్‌ను ట్యూన్‌ చేశారు. ఈ బైక్‌లో డ్యూయల్‌ ఛానల్‌ ABS స్టాండర్డ్‌గా వస్తుంది. ఆకర్షణీయమైన డిజైన్‌, శక్తిమంతమైన పెర్ఫార్మెన్స్‌తో N250 మంచి ఆప్షన్‌.

3. Bajaj Pulsar NS200 - ₹1.32 లక్షలు

బజాజ్‌ NS200 లిక్విడ్‌-కూల్డ్‌ 200cc ఇంజిన్‌తో, 24.5hp పవర్‌తో వస్తుంది. ఇది ఈ లిస్ట్‌లో అత్యంత పవర్‌ఫుల్‌ బైకుల్లో ఒకటి. డ్యూయల్‌ ఛానల్‌ ABS స్టాండర్డ్‌గా ఉండటంతో సేఫ్టీ పరంగా కూడా టాప్‌ పొజిషన్‌.

4. TVS Apache RTR 160 4V - ₹1.26 లక్షలు

160cc సెగ్మెంట్‌లో ఈ అపాచీ 4V అగ్రగామి బైక్‌. టాప్‌ 3 వేరియంట్లలో డ్యూయల్‌ ఛానల్‌ ABS అందుబాటులో ఉంది. అదనంగా USD ఫోర్క్స్‌, TFT డిస్‌ప్లే, ట్రాక్షన్‌ కంట్రోల్‌ ఫీచర్లు కూడా ఉన్నాయి.

5. TVS Apache RTR 160 2V - ₹1.23 లక్షలు

ఇటీవలే OBD2B నిబంధనలకు అనుగుణంగా అప్‌డేట్‌ అయిన ఈ మోడల్‌లో కూడా డ్యూయల్‌ ఛానల్‌ ABS టాప్‌ వేరియంట్‌లో లభిస్తుంది. ఇంజిన్‌ సైజ్‌ చిన్నగా ఉన్నా, రైడ్‌ క్వాలిటీ & సేఫ్టీ రెండూ బాగుంటాయి.

6. Bajaj Pulsar NS160 - ₹1.20 లక్షలు

NS160, రైడర్‌కు సపోర్ట్‌ చేసే పెర్ఫార్మెన్స్‌ & స్పోర్టీ లుక్‌తో మంచి ఇంప్రెషన్‌ ఇస్తుంది. పెరిమీటర్‌ ఫ్రేమ్‌, USD ఫోర్క్‌, రైజ్డ్‌ క్లిప్‌-ఆన్‌ హ్యాండిల్‌బార్స్‌తో రైడింగ్‌ పొజిషన్‌ సూపర్‌గా ఉంటుంది. డ్యూయల్‌ ఛానల్‌ ABS స్టాండర్డ్‌గా వస్తుంది.

7. Bajaj Pulsar N160 - ₹1.17 లక్షలు

ఇది ఈ లిస్ట్‌లో అత్యంత చవకైన డ్యూయల్‌ ఛానల్‌ ABS బైక్‌. 160cc ఇంజిన్‌, స్టైలిష్‌ లుక్‌, సేఫ్టీ ఫీచర్‌లతో ఇది కమ్యూటర్‌ సెగ్మెంట్‌/ డైలీ రైడర్లకు పర్ఫెక్ట్‌ ఆప్షన్‌.

బైకుల్లో రూ.1.17 లక్షల నుంచే ఇప్పుడు డ్యూయల్‌ ఛానల్‌ ABS టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఇది కేవలం ప్రీమియం బైక్‌ల ఫీచర్‌ కాదు, మాస్‌ మార్కెట్‌ రైడర్లకు కూడా సేఫ్టీ గ్యారంటీగా మారింది. కాబట్టి కొత్త బైక్‌ కొనాలనుకునే వారు సేఫ్టీని మొదటి ప్రాధాన్యంగా పెట్టుకోవడం మంచిది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.