No IAS For disabled : తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారి ఐఏఎస్‌లలో దివ్యాంగుల కోటాపై చేసిన వ్యాఖ్యలపై విస్తృత చర్చ జరుగతోంది. సైన్యంలో..పోలీసుల్లో ఎలా అయితే దివ్యాంగులను తీసుకోరో.. అలాగే ఐఏఎస్‌లోనూ తీసుకోకూడదని అంటున్నరు. ఐఏఎస్ అధికారి చాలా కష్టపడాల్సి ఉంటుందని .. ఆమె అభిప్రాయం. శారీకంగా ఫిట్ గా లేని వారు ఐఏఎస్ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించలేరని దీనిపై చర్చ జరగాలని స్మితా సబర్వాల్ అంటున్నారు. స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఎక్కువ మంది విమర్శిస్తున్నారు. కొంత మంది మాత్రం ఆమె చెప్పింది కరెక్టేనంటున్నారు.
ఐరా సింఘాల్ గురించి స్మితా సబర్వాల్ తెలుసుకోవాలన్న కొంత మంది నెటిజన్లు
ఐఏఏస్ అధికారుల్లో డిసేబుల్ కోటా కింద అనేక మంది అధికారులు ఎంపికయ్యారు. 2014లో యూపీఎస్సీ టాపర్ గా ఐరా సింఘాల్ ఎన్నికయ్యారు. చాలా మంది ఆమె గురించి స్మితా సబర్వాల్ తెలుసుకోవాలని సూచించారు. మొదటి ర్యాంకు సాధించిన ఐరా దివ్యాంగురాలని.. ఆమె ప్రతిభ ముందు వైకల్యం ఓడిపోయిందని గుర్తు చేస్తున్నారు. ఐరా సింఘాల్ శిక్షణలో రాష్ట్రపతి పురస్కారం పొందారు. నార్త్ ఢిల్లీ సబ్ కలెక్టర్ గా తొలి పోస్టింగ్ లో అలీపూర్ ఏరియాలో 340 మంది బాల కార్మికులను, వెట్టి చాకిరీ చేస్తున్నవారిని రెస్క్యూ ఆపరేషన్ చేసి కుటుంబాల దగ్గరకు చేర్చారని గుర్తు చేస్తున్నారు. నీతి ఆయోగ్, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ లాంటి కేంద్ర విభాగాలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. ప్రఖ్యాత విద్యా సంస్థల్లో, సెమినార్లలో 500 కి పైగా ఉపన్యాసాలు ఇచ్చారని వివరిస్తున్నారు. దివ్యాంగులు ఎన్నో రంగాల్లో విజయాలు సాధించిన దాఖలాలు మన కళ్ల ముందే ఉన్నాయని వారిని కించ పరచడం సమంజసం కాదని అంటున్నారు.
కించ పర్చడం సరి కాదంటన్న దివ్యాంగులు
ఫిజికల్ ఫిట్ నెస్ మీద ఆమె ఎలాగైనా కూడా తన ఒపీనియన్ షేర్ చేసుకోవచ్చు కానీ డిజేబుల్ కమ్యూనిటీని ఉద్దేశిస్తూ ముఖ్యంగా డిజేబుల్ పైలెట్ నడిపే ఫ్లైట్ లో మీరు ప్రయాణిస్తారా ? డిజేబుల్ సర్జన్ తో మీరు సర్జరీ చేయించుకుంటారా ? అనే రెండు స్ట్రైట్ స్టేట్మెంట్స్ ఇవ్వడం సరి కాదని డిజేబుల్స్ రైట్స్ యాక్టివిక్ట్ కొప్పుల వసుంధర స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో స్పందన వ్యక్తం చేశారు. ప్రెస్ క్లబ్ లోనూ మీడియా సమావేశంలో పాల్గొని స్మితా సబర్వాల్ వ్యాఖ్యలను ఖంటించారు. డిజేబులిటీ వల్ల అన్ ప్రొడక్టివ్ సెక్టార్లో పడిపోయిన కమ్యూనిటీ కేవలం పింఛన్ల కే పరిమితం అయిపోయిందని.. సొసైటీలో సింపతి తప్ప ఎంపతి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టులకేక్కి, మీడియా లో కెక్కి మా చట్టం మాకు ప్రసాదించిన హక్కులను కూడా ఎంతో గొడవపడి, వేదనకు గురి అయ్యి సాధించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయంటున్నారు. డిజేబిలిటీ అనేది మా శరీరానికి కానీ ఆత్మస్థైర్యాన్ని కానీ, నైపుణ్యాలకు కానీ, మా టాలెంట్ కానీ కాదు అని ఆమె అంటున్నారు.
స్మితా సబర్వాల్ వాదనకు సమర్థింపులు కూడా !
స్మితా సబర్వాల్ వాదనకు సోషల్ మీడియాలో సమర్థింపులు కూడా ఉన్నాయి.మీరు నిజమే చెబుతున్నారని.. ఫీల్డ్ లో పని చేసే ఉద్యోగాలకు .. ఖచ్చితంగా ఫిట్‌నెస్ ఉండాలని చెప్పకొచ్చారు. కొన్ని అభిప్రాయాలకు స్మితా సబర్వాల్ ఓపికగా సమాధానాలిచ్చారు.
యూపీఎస్సీలో చర్చ జరుగుతుందా?
స్మితా సబర్వాల్ వ్యక్తం చేసిన అభిప్రాయాలు వేరు కానీ అంతకు ముందు ఇదే అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. తప్పుడు సర్టిఫికెట్ల ద్వారా ఐఏఎస్ తెచ్చుకుంటున్నారన్న ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. దొరికిపోయిన పూజా ఖేద్కర్ మాత్రమే కాదు సర్వీసులో ఉన్న ఎంతో మంది అదే తరహా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కనిపెట్టలేని చాలా చిన్న చిన్న డిసేబులిటీస్ ఉన్నా ఆ కోటాలో సర్టిఫికెట్ తెచ్చుకుని ఐఏఎస్ పొందుతున్నారు. పూజా ఖేద్కర్ కు 800కుపైగా ర్యాంక్ వచ్చినా డిజేబులిటి కేటగిరిలోనే ైఏఎస్ వచ్చింది. అయితే స్మితా సబర్వాల్ మాత్రం అసలు ఐఎఎస్‌లలోనే డిజేబులిటీ ఉన్న వారికి కోటా రద్దు చేయాలని.. అలాంటి వారిని అనర్హులుగా గుర్తించాలని అంటున్నారు.