Skype Shut Down: విదేశాల్లో చదువు కోసమో.. ఉద్యోగం కోసమో వెళ్లిన పిల్లలతో ఫోన్లు మాట్లాడటమే కష్టంగా ఉన్న సమయంలో వీడియో కాల్స్ చేసుకునే అద్భుత సౌకర్యాన్ని మైక్రోసాఫ్ట్ అందుబాటులోకి తెచ్చింది. ఇరవై రెండేళ్ల క్రితం అందుబాటులోకి వచ్చిన ఆ అద్భుత వీడియో కాల్ సౌకర్యం పేరు స్కైప్. ఈ స్కైప్ తో కొన్ని లక్షల మంది విదేశాల్లో ఉన్న తమ బంధువులతో వీడియో కాల్స్ మాట్లాడుకునేవారు. అదే సమయంలో బిజినెస్ చర్చలకూ ఈ స్కైప్ ఉపయోగపడేది. అయితే ఇరవై రెండేళ్ల తర్వాత ఈ స్కైప్ ను డిస్ కంటిన్యూ చేయాలని మైక్రోసాఫ్ట్ నిర్ణయించింది.
మే 5, 2025న స్కైప్‌ను అధికారికంగా మూసివేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. ప్రస్తుత స్కైప్ వినియోగదారులు వారి లాగిన్ ద్వారా డేటా అంతా భద్రతపరుచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ యాప్ ను ఇప్పటి వరకూ ఉపయోగించుకున్న వారు తమ డేటాను భద్ర పరుచుకోవడానికి అవకాశం కల్పిస్తామని..ప్రకటించింది.
చాలా మందికి స్కైప్ కేవలం వీడియో-కాలింగ్ యాప్ కాదు.అంత కంటే కంటే ఎక్కువ—ఇది ప్రియమైనవారికి కనెక్షన్. ఒక వినియోగదారుడు “RIP Skype” అని షేర్ చేశాడు. నేను నా కుటుంబం మొత్తానికి దూరంగా US లో పెరిగాను. కానీ ఇండియాలో ఉన్న బంధువులతో తనకు స్కైప్ ద్వారానే అనుబంధం ఏర్పడిందన్నారు. అనేక దేశాల నుంచి చాలా మంది స్కైప్ డిస్ కంటిన్యూపై భావోద్వేగంతో స్పందిస్తున్నారు.
ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ టీమ్స్ అనే ఫ్లాట్ ఫాం మీద పని చేస్తోంది. ఆ ఫ్లాట్ ఫాం మీదకు మారే వారికి అవకాశం కల్పిస్తోంది.
కరోనా సమయంలో జూమ్ వీడియో కాలింగ్ యాప్ బాగా పాపులర్ అయింది. అయితే అది కాన్ఫరెన్స్ లకు ఉపయోగపతుంది. మామూలు వీడియో కాలింగ్ కోసం .. ఇప్పుడు వాట్సాప్ కూాడా ఉపయోగపడుతుంది. అందుకే స్కైప్ కు ఆదరణ తగ్గిపోయింది.