కోల్‌కతాలోని సాహా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 17 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి పదో తరగతి, ఐటీఐ, బీఈ, బీటెక్, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 25 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 17
⏩ ఇంజినీర్ ‘సి’: 02
⏩ టెక్నీషియన్ ‘బి’ (ఎలక్ట్రికల్ వైరింగ్/ సర్వీసింగ్/ మెయింటెనెన్స్): 05
⏩ టెక్నీషియన్ 'బి' (ఏసీ మెయింటెనెన్స్, ఏసీ ప్లాంట్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్): 01
⏩ టెక్నీషియన్ ‘బి’(కంప్యూటర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ పెరిఫెరల్స్): 03
⏩ టెక్నీషియన్ ‘బి’ (ట్రేసర్/ డ్రాఫ్ట్స్‌మన్ ఫర్ డ్రాయింగ్ ఆఫీస్): 01
⏩ ఎల్‌డీసీ (లోయర్ డివిజన్ క్లర్క్): 05
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఐటీఐ, బీఈ, బీటెక్, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: ఇంజినీర్ ‘సి’ పోస్టులకి 30 సంవత్సరాలు, టెక్నీషియన్ ‘బి’ & ఎల్‌డీసీ పోస్టులకి 25 సంవత్సరాలు ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక ప్రక్రియలు: పోస్టును అనుసరించి రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ట్రేడ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ముఖ్యమైనతేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 25.08.2023.
➥ అప్లికేషన్ హార్డ్ కాపీ స్వీకరణకు చివరి తేదీ: 06.09.2023.
ALSO READ:
ఏపీలోని యూనివర్శిటీల్లో పోస్టుల భర్తీకి ఆగస్టు 23న నోటిఫికేషన్ - 3925 పోస్టుల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్‌లోని వర్సిటీలు, ట్రిపుల్ ఐటీల్లో భారీ రిక్రూట్‌మెంట్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 3,295 పోస్టుల భర్తీకి సీఎం జగన్ ఆమోదం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్సిటీల్లో రెగ్యులర్ సిబ్బంది నియామకానికి ఆమోదం తెలిపింది జగన్ ప్రభుత్వం. నవంబర్ 15 నాటికి నియామక ప్రక్రియ మొత్తం పూర్తి కానుంది. ఈ పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు.యూనివర్సిటీల్లో 2,635 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ట్రిపుల్ ఐటీల్లో 660 పోస్టులు భర్తీ చేస్తారు. ఉన్నత విద్యాశాఖలో అత్యున్నత ప్రమాణాల కల్పనలో భాగంగా.. ఇప్పటికే ప్రపంచస్థాయి కరిక్యులమ్ ఏర్పాటు దిశగా సన్నాహాలు సాగుతున్నాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
పోస్టాఫీసుల్లో కొలువుల జాతర, 30 వేలకుపైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడి! తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టాఫీసుల్లో 30,041 గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్ షెడ్యూల్-2, జులై 2023) ఖాళీల భర్తీకి ప్రకటన వెలువడింది. పదో తరగతిలో సాధించిన మార్కులతో ఈ నియామకాలు చేపడతారు. ఎంపికైనవారు బ్రాంచ్ పోస్టు మాస్టర్(బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్(ఏబీపీఎం), డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. పోస్టును బట్టి రూ.10,000 - రూ.12,000 ప్రారంభ వేతనం అందుకోవచ్చు. ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 23 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.ఆంధ్రప్రదేశ్‌లో 1,058, తెలంగాణలో 961 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు ఎంపికైనవారు రోజుకు నాలుగు గంటలు పనిచేస్తే సరిపోతుంది. వీటితోపాటు ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకుకు సంబంధించిన సేవలకు గానూ ప్రత్యేకంగా ఇన్సెంటివ్ రూపంలో బీపీఎం/ ఏబీపీఎం/ డాక్ సేవక్‌లకు ప్రోత్సాహం అందిస్తారు. ఆ సేవల విలువ ప్రకారం ఇంటెన్సివ్ ఆధారపడి ఉంటుంది. వీరు రోజువారీ విధులు నిర్వర్తించడానికి ల్యాప్‌టాప్/ కంప్యూటర్/ స్మార్ట్ ఫోన్ లాంటివి తపాలా శాఖ సమకూరుస్తుంది. సంబంధిత కార్యాలయానికి అందుబాటులో నివాసం ఉండాలి. సైకిల్ తొక్కడం రావాలి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..