Breaking News Telugu Live Updates: ఎమ్మెల్యే కోటంరెడ్డికి భద్రత తగ్గించిన ఏపీ సర్కార్
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం..
సీఎం కేసీఆర్ నాందేడ్ పర్యటన షెడ్యూల్..
* హైదరాబాద్ నుంచి సీఎం కేసీఆర్ బయలుదేరి మధ్యాహ్నం 12.30గంటలకు నాందేడ్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
* అక్కడి నుంచి ప్రత్యేక కాన్వయ్‌లో బయలుదేరి సభా వేదిక సమీపంలోని చత్రపతి శివాజీ విగ్రహం వద్దకు చేరుకుంటారు. పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారు.
* అనంతరం అక్కడి నుంచి బయలుదేరి చారిత్రక గురుద్వారాను సందర్శిస్తారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు.
* అక్కడి నుంచి 1.30గంటలకు సభాస్థలికి చేరుకోనున్నారు. సీఎం కేసీఆర్ సమక్షంలో మహారాష్ట్రకు చెందిన పలువురు సీనియర్ నేతల చేరికలు.
* అనంతరం బీఆర్‌ఎస్ నాందేడ్ నేతలను ఉద్దేశించి ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ప్రసంగం.
* 2.30గంటలకు సభా స్థలి నుంచి స్థానిక సిటీ ప్రైడ్ హోటల్‌కు చేరుకుంటారు.
* భోజనానంతరం 4గంటలకు జాతీయ, స్థానిక మీడియా ప్రతినిధులతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు.
* 5గంటలకు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి భద్రతను తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2+2 భద్రతను 1+1కు తగ్గించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
కేసీఆర్ మనవడు రితేశ్ రావు మిస్సింగ్, డీజీపీ ఆఫీసు ముట్టడికి బయలుదేరిన రమ్య రావు
▪️అర్ధరాత్రి పోలీసులే తీసుకెళ్లారంటున్న తల్లి
కేసీఆర్ మనవడు రితేష్ రావు కనిపించడం లేదని రమ్య రావు ఆరోపించారు.
▪️రెండు రోజుల క్రితం జూబ్లీహిల్స్‌లోని తన ఇంట్లో అర్ధరాత్రి సమయంలో పోలీసులు తన కొడుకుని తీసుకెళ్లారని
▪️ఇప్పటి వరకు ఏ పోలీస్ స్టేషన్‌లో ఉన్నడనే విషయాన్ని చెప్పడం లేదని ఫైర్ అయ్యారు.
▪️కేసీఆర్ మనవడు రితేష్ రావు కనిపించడం లేదని రమ్య రావు ఆరోపించారు.
▪️రెండు రోజుల క్రితం జూబ్లీహిల్స్‌లోని తన ఇంట్లో అర్ధరాత్రి సమయంలో పోలీసులు తన కొడుకుని తీసుకెళ్లారని, ఇప్పటి వరకు ఏ పోలీస్ స్టేషన్‌లో ఉన్నాడనే విషయాన్ని చెప్పడం లేదని ఫైర్ అయ్యారు.
▪️సిటీ వ్యాప్తంగా గాలించిన తన కొడుకు ఆచూకీ లభించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
▪️డీజీపీ ఆఫీస్ ను ముట్టడించేందుకు కేసీఆర్ అన్న కూతురు రమ్య రావు బయలుదేరారు.
▪️ఇదిలా ఉండగా రాష్ట్రంలోని వివిధ సమస్యలపై వెంటనే పరిష్కరించాలని NSUI అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది.
▪️ప్రివెంటీవ్ అరెస్ట్ కింద NSUI ముఖ్య కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.
▪️అయితే అరెస్ట్ అయిన వాల్లు ఎక్కడ ఉన్నారనేది తల్లిదండ్రులకు తెలియకుండా పోలీసులు గోప్యంగా ఉంచడంపై రమ్య రావు ఆగ్రహం వ్యక్తం చేశారు
Police Notices To Congress EX MP Mallu Ravi
గాంధీ భవన్ - కాంగ్రెస్ నేత మల్లు రవికి మరోసారి నోటీసులు జారీ చేశారు.
కాంగ్రెస్ వార్ రూం ఇష్యూలో మరో కేసు నమోదు చేసిన సికింద్రాబాద్ మార్కెట్ పోలీసులు.
గాంధీ భవన్ కి వచ్చి నోటీసులు అందచేసిన పోలీసులు.
ఓ మరణం నుంచి కోలుకోక ముందు మరో మరణ వార్తను ప్రేక్షకులు, చిత్ర పరిశ్రమ ప్రముఖులు వినక తప్పని పరిస్థితి. కాశీనాథుని విశ్వనాథ్ మరణాన్ని ఇంకా ఎవరూ జీర్ణించుకోలేదు. అంతలో మరో దిగ్గజం మనల్ని వదిలి వెళ్ళారు.
లెజెండరీ సింగర్ వాణీ జయరామ్ (Vani Jayaram) ఇకలేరు. ఈ రోజు తుదిశ్వాస విడిచారు. వాణీ జయరామ్ వయసు 78 ఏళ్ళు. చెన్నైలోని నాగంబాక్కంలో గల హద్డౌస్ రోడ్డులోని స్వగృహంలో కన్ను మూశారు. తలకు గాయం కావడంతో ఆమె మరణించినట్లు ప్రాధమిక సమాచారం అందుతోంది. ఆమె మృతి మిస్టరీగా మారింది.
Background
ఓ మరణం నుంచి కోలుకోక ముందు మరో మరణ వార్తను ప్రేక్షకులు, చిత్ర పరిశ్రమ ప్రముఖులు వినక తప్పని పరిస్థితి. కాశీనాథుని విశ్వనాథ్ మరణాన్ని ఇంకా ఎవరూ జీర్ణించుకోలేదు. అంతలో మరో దిగ్గజం మనల్ని వదిలి వెళ్ళారు.
లెజెండరీ సింగర్ వాణీ జయరామ్ (Vani Jayaram) ఇకలేరు. ఈ రోజు తుదిశ్వాస విడిచారు. వాణీ జయరామ్ వయసు 78 ఏళ్ళు. చెన్నైలోని నాగంబాక్కంలో గల హద్డౌస్ రోడ్డులోని స్వగృహంలో కన్ను మూశారు. తలకు గాయం కావడంతో ఆమె మరణించినట్లు ప్రాధమిక సమాచారం అందుతోంది. ఆమె మృతి మిస్టరీగా మారింది.
ఇటీవల పద్మభూషణ్ ప్రకటన
వాణీ జయరామ్ చిత్రసీమకు చేసిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం మొన్న గణతంత్ర దినోత్సవం నాడు పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. దేశంలోని మూడో అత్యున్నత పురస్కారంతో ఆమె సత్కరించింది. ఆ అవార్డు అందుకోక ముందు ఆవిడ కన్ను మూయడం విషాదమని అభిమానులు, ప్రేక్షకులు విలపిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణం ఉంటుందని రెండు రాష్ట్రాల వాతావరణ శాఖలు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్‌తో పోల్చుకుంటే తెలంగాణలో చలి తీవ్రత కాస్త ఎక్కువగా ఉండబోతుంది. ఏడు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో చలి మళ్లీ పెరిగింది. హైదరాబాద్ వాతావరణ శాఖ 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఏడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఐదు నుంచి పది డిగ్రీల మధ్య ఉంటాయి. ఎల్లో అలెర్ట్ జారీ చేసిన జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పదకొండు నుంచి పదిహేను డిగ్రీల వరకు నమోదుకు అవకాశం ఉంది. ఐదు రోజుల ఉష్ణోగ్రత అంచనాలు విడుదల చేసిన తెలంగాణ వాతావరణ శాఖ... ఇందులో రెండు రోజులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నిన్నటి కంటే ఇవాళ చలి తీవ్రత ఎక్కువ ఉంటుందని చెబుతోంది.
తెలంగాణ ప్రాంతంలో ప్రస్తుతానికి ఎలాంటి వర్ష సూచనలు లేవని హైదరాబాద్ వాతావరణం కేంద్రం తెలిపింది. నిన్న విడుదల చేసిన బులెటిన్ బట్టి చూస్తే... ఖమ్మంలో గరిష్ణ ఉష్ణోగ్రత నమోదు అయింది. 33.6 డిగ్రీలు నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. అత్యల్ప ఉష్ణోగ్రత 7.7 డిగ్రీలు ఆదిలాబాద్‌లో నమోదైంది. ఇవాళ అత్యధిక ఉష్ణోగ్రత 30 డిగ్రీలుగా ఉంటుందని... అత్యల్పం 15 డిగ్రీలుగా ఉంటుందని అంచనా వేసింది. ఇవాళ్టి నుంచి ఏడో తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా పొడి వాతావరణమే ఉంటుంది.
Police On Lokesh Padayatra : చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో లోకేష్ పాదయాత్రలో ఏర్పడిన ఉద్రిక్తతలు రాజకీయ దుమారానికి కారణం అయ్యాయి. పాదయాత్రకు వస్తున్న ఆదరణకు భయపడి పోలీసులు అడ్డుకోవాలని చూస్తున్నారని టీడీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై పోలీసులు స్పందించారు. లోకేష్ యువగళం పాదయాత్ర అడ్డుకోవాలన్న ఉద్దేశం పోలీసులకు లేదని.. సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ మేరకే విధులను నిర్వర్తిస్తున్నామని.. నంతపురం రేంజ్ డీఐజీ రవి ప్రకాష్ ప్రకటించారు. పాదయాత్ర సమయంలో గైడ్ లైన్స్ ఉల్లంఘిస్తే చట్టపరమైన వ్యవహరిస్తున్నామన్నారు. పాదయాత్ర ఆపాలంటూ ప్రభుత్వ పెద్దల నుండి ఎలాంటి ఒత్తిడి లేదని.. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని రవి ప్రకాష్ స్పష్టం చేశారు.
- - - - - - - - - Advertisement - - - - - - - - -