Shraddha Murder Case: మనసు మార్చుకున్న అఫ్తాబ్- బెయిల్ పిటిషన్ ఉపసంహరణ

ABP Desam   |  Murali Krishna   |  22 Dec 2022 04:37 PM (IST)

Shraddha Murder Case: శ్రద్ధా వాకర్ హత్య కేసు నిందితుడు అఫ్తాబ్ తన బెయిల్ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నాడు.

దిల్లీ శ్రద్ధా హత్య కేసు

Shraddha Murder Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్లీ శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఆమె ప్రియుడు అఫ్తాబ్ పూనవాలా మనసు మార్చుకున్నాడు. తనకు బెయిల్ మంజూరు చేయాలని వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నాడు. ఈ మేరకు గురువారం కోర్టుకు తెలిపాడు. అఫ్తాబ్‌యే బెయిల్ వద్దని చెప్పడంతో దిల్లీ సాకేత్ కోర్టు ఈ పిటిషన్‌ను కొట్టివేసింది.

కోర్టు ముందు

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరైన అఫ్తాబ్ తాను డిసెంబరు 15న కోర్టులో వేసిన తన బెయిల్ అభ్యర్థనను ఉపసంహరించుకోవాలని అనుకుంటున్నానని తెలిపాడు. దీనిపై శ్రద్ధా తండ్రి తరపున వాదిస్తున్న న్యాయవాది సీమా కుష్సహా మాట్లాడారు.

ఇప్పటివరకు ఇంకా ఛార్జ్ షీట్ యే దాఖలు చెయ్యలేదు, అఫ్తాబ్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ కోసం వేసిన పిటిషన్‌ను అఫ్తాబ్ అంగీకరించలేదు. అతని తరపు న్యాయవాది మొదట మానవత్వం వైపు నిలబడి తర్వాత నేరస్థుడు గురించి పోరాడాలి. ఎలాగైతేనేం ఈ రోజు అతనే బెయిల్ పిటిషన్ ను ఉపసంహరించుకున్నాడు. -                               శ్రద్ధా తండ్రి తరఫు న్యాయవాది

ఈ హత్య కేసులో నవంబరు 12న అరెస్ట్ అయిన అఫ్తాబ్ ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్నాడు. కోర్టు డిసెంబరు 9న అఫ్తాబ్ కస్టడీ 14 రోజులు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

పోలీస్ విచారణ 

ఈ కేసు దర్యాప్తులో పురోగతి గురించి స్పెషల్ పోలీస్ కమిషనర్ సాగర్ ప్రీత్ హూడా మాట్లాడారు. 

డీఎన్ఏ టెస్ట్ నివేదిక, పాలిగ్రఫ్ టెస్ట్ నివేదికలు పోలీసులకు అందాయి. డిసెంబరు 2న నిర్వహించిన పోస్ట్ నార్కో టెస్ట్ లో హత్య చేసినట్టు అఫ్తాబ్ ఒప్పుకున్న నివేదిక ఇంకా అందలేదు. అఫ్తాబ్ పాలిగ్రఫ్ టెస్ట్ నివేదిక ఈ బుధవారం పోలీసులకు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ వారు సమర్పించారు. కేసు నమోదు అయినప్పటి నుంచి విచారిస్తున్న పోలీసులు ఇప్పటి వరకు 13 ఎముకలను సేకరించారు. హత్య జరగడానికి మూడు రోజుల ముందు వారు మారినా చట్రాపుర్ ఇంట్లో రక్త నమూనాలు సేకరించారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతునే ఉంది.                                          -  సాగర్ ప్రీత్, స్పెషల్ పోలీస్ కమిషనర్

Also Read: Indo-China Border Standoff: తవాంగ్ ఘర్షణ తర్వాత తొలి భేటీ- చైనాతో భారత్‌ చర్చలు సఫలమా?

Published at: 22 Dec 2022 04:34 PM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.