Cyclonic Michaung live updates: బాపట్ల తీరాన్ని దాటిన మిగ్ జాం తుపాను - గంటకు 90 నుంచి 120 కి.మీ వేగంతో ఈదురు గాలులు

Cyclonic Michaung live updates: మిగ్‌జాం తుపానుకు సంబంధించిన లైవ్‌ అప్‌డేట్స్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ABP Desam Last Updated: 05 Dec 2023 04:25 PM

Background

పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఏర్పడిన తుపాను నెమ్మదిగా తీరంవైపునకు దూసుకొస్తోంది. దక్షిణ ఆంధ్ర ప్రదేశ్ - ఉత్తర తమిళనాడు తీరాల మీదుగా ఏర్పడిన తీవ్ర తుపాను మిగ్‌జాం గంటలకు 7 కిలోమీటర్ల వేగంతో పయనిస్తోంది. ఇది ఉత్తర వాయువ్య దిశగా కదిలి...More

బాపట్ల తీరాన్ని దాటిన మిగ్ జాం తుపాను - గంటకు 90 నుంచి 120 కి.మీ వేగంతో ఈదురు గాలులు

బాపట్ల వద్ద మిగ్ జాం తుపాను తీరం దాటింది. ఈ క్రమంలో తీరం వెంబడి గంటకు 90 నుంచి 120 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. మరో 2 గంటల్లో తీవ్ర తుపాను అల్ప పీడనంగా బలహీన పడనుంది. తుపాను తీరం దాటినా, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.