Serious Allegations Surface in Rajasthan IAS Couple Dispute: భార్యభర్తల మధ్య తేడాలు వస్తే వాళ్లు ఐఏఎస్‌లు అయినా అంతకు మించిన వాళ్లు అయినా రోడ్డున పడాల్సిందే. రాజస్థాన్ సీనియర్ IAS అధికారులు భారత్ దీక్షిత్, ఆశీష్ మోడీల మధ్య ఏర్పడిన వివాదం సంచలనంగా మారింది. భారత్ దీక్షిత్ తన భర్త, సహచర IAS అధికారి అశీష్ మోడీపై సంచలన ఆరోపణలు చేస్తూ విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. జైపూర్ పోలీస్ స్టేషన్‌లో తన భర్త శారీరక దాడి, అక్రమ సంబంధాలు, దుర్వ్యసనాలు, కుటుంబ సభ్యులను బెదిరించడం, విడాకుల కోసం ఒత్తిడి చేయడం వంటి ఆరోపణలతో కేసు పెట్టారు.
భారత్ దీక్షిత్ FIR ప్రకారం, అశీష్ మోడీ తనపై శారీరక దాడి చేసి, ఇంట్లో అక్రమంగా బంధించారని ఆరోపించారు. కుమార్తె జన్మించిన తర్వాత తర్వాత అతని ప్రవర్తన మారిందని .. అక్రమ సంబంధాలు, మద్యపానం, కుటుంబ సభ్యులపై బెదిరింపులకు పాల్పడటం వంటివి చేస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. విడాకుల కోసం ఒత్తిడి చేస్తూ, కుటుంబాన్ని బెదిరిస్తున్నారని ..తన జీవితాన్ని ప్రమాదంలో పడేశారని FIRలో పేర్కొన్నారు. ఈ ఆరోపణలు డొమెస్టిక్ వయలెన్స్ చట్టం (2005) కింద నమోదయ్యాయి. పోలీసులు అశీష్ మోడీపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.
ఈ జంట 2011 బ్యాచ్‌కు చెందినది. భారత్ దీక్షిత్ ప్రస్తుతం రాజస్థాన్ మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్‌లో MDగా, అశీష్ మోడీ జైసల్మేర్ కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. రాజస్థాన్ బ్యూరోక్రసీలో ఈ వివాదం పెద్ద సంచలనం రేపింది.
రాజస్థాన్ IAS అధికారుల మధ్య ఇలాంటి వివాదాలు అసాధారణం కాదు, కానీ ఈ సారి డొమెస్టిక్ వయలెన్స్‌ను హైలైట్ చేస్తున్నాయి. భారత్ దీక్షిత్ తన FIRలో "బలవంతంగా వివాహం, అక్రమ సంబంధాలు" వంటి విషయాలు కూడా పేర్కొన్నారు. పోలీసులు ఈ కేసులో ఆధారాలు సేకరిస్తున్నారు. అశీష్ మోడీ వైపు నుంచి ఇంకా అధికారిక ప్రతిస్పందన లేదు.