Rajahmundry-Kakinada Trains Cancelled: ఆంధ్రప్రదేశ్‌లోని అతి ముఖ్యమైన స్టేషన్‌లలో ఒకటైన తుని వద్ద రైల్వే ట్రాక్ పనులు జరుగుతున్నాయి. ముఖ్యంగా తుని -రావికంపాడు సెక్షన్‌లో ఆటో - సిగ్నలింగ్ కి సంబంధించిన ముఖ్యమైన వర్క్ జరుగుతోంది. అందువల్ల ఈ రూట్‌లో వెళ్లే 4 రైళ్ళని క్యాన్సిల్ చేసింది రైల్వే శాఖ. ఈ నెల 20 వ తేదీన ఈ నాలుగు రైళ్లు రద్దు చేసినట్టు తెలిపింది. కాబట్టి దానికి అనుగుణంగా జర్నీ ప్లాన్ చేసుకోవాలని ప్రయాణికులను కోరారు అధికారులు. రద్దు అయిన

Continues below advertisement

రైళ్ల వివరాలు.

1) ట్రైన్ నెం 17267 కాకినాడ -విశాఖపట్నం ఎక్స్ ప్రెస్ 

2) ట్రైన్ నెం 17268 విశాఖపట్నం -కాకినాడ ఎక్స్ ప్రెస్ 

Continues below advertisement

3) ట్రైన్ నెంబర్ 67285-రాజమండ్రి -విశాఖపట్నం -మెము ప్యాసింజర్ 

4) ట్రైన్ నెంబర్ 67286-విశాఖపట్నం -రాజమండ్రి మెము ప్యాసింజర్ 

ఈ నాలుగు రైళ్లను నవంబర్ 20వ తేదీన రద్దు చేశారు. రాజమండ్రి, కాకినాడ నుంచి అన్నవరం వెళ్లే యాత్రికులకు ఈ రైళ్లు చాలా ముఖ్యమైనవి కాబట్టి వారు ఈ రైళ్ళ రద్దు విషయం ముందుగానే గమనించాలని అధికారులు కోరారు.