13 th July 2024 News Headlines in Telugu For School Assembly:
1. ఆంధ్రప్రదేశ్‌లో సాగునీటి ప్రాజెక్టుల కోసం చంద్రబాబు ప్రభుత్వం నిధుల సమీకరణపై దృష్టి పెట్టింది. ప్రపంచ బ్యాంక్ నిధులను రాబట్టి వాటి ద్వారా ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో చర్చలు జరిగాయి. సత్వరం పూర్తయ్యే ప్రాజెక్టులకు నిధులు ఇచ్చేందుకు తమకు అభ్యంతరం లేదని వరల్డ్ బ్యాంక్ తెలిపింది.
2. అమరావతిలో కట్టడాల పటిష్టతపై అధ్యయనం చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. IASలు, ఎన్జీవోల సముదాయాలు, సచివాలయాల ఐకానిక్ టవర్లు, అసెంబ్లీ భవనాల బేస్‌మెంట్‌లపై అధ్యయనం చేయాలని మంత్రి నారాయణ ఆదేశించారు. కట్టడాల పటిష్టత నిర్ధారణ విషయంలో ఐఐటీ చెన్నైకి అప్పగించాలని నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు ఐఐటీ చెన్నై, ఐఐటీ HYD సంస్థలకు ప్రభుత్వం లేఖలు రాయనుంది.
3. తెలంగాణలో డీఎస్సీ అభ్యర్థులకు విద్యాశాఖ శుభవార్త చెప్పింది. ఒకే రోజు రెండు సబ్జెక్టుల పోస్టులకు సంబంధించిన డీఎస్సీ పరీక్షలు ఉన్నవారు ఉదయం ఎగ్జామ్ రాసిన సెంటర్‌లోనే రెండో దానికి హాజరుకావచ్చని వెల్లడించింది. నాన్ లోకల్ పోస్టులకు అప్లై చేయడంతో కొందరికి ఉదయం ఒక జిల్లాలో, మధ్యాహ్నం మరో జిల్లాలో పరీక్ష ఉంది. దీంతో వారికి హాల్ టికెట్లు మార్చి ఇస్తామని స్పష్టం చేసింది.
4. EAPCET కౌన్సెలింగ్‌లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ గడువు నేటితో ముగియనుంది. ఆప్షన్ల నమోదుకు ఈ నెల 15 వరకు అవకాశం ఉంది. ఇప్పటివరకు 99,170 మంది విద్యార్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించగా.. 60వేల మంది ఆప్షన్లు నమోదు చేశారు. ఈ నెల 19వ తేదీ లోగా విద్యార్థులకు సీట్లు కేటాయించనున్నారు. ఆ తర్వాత 23లోగా విద్యార్థులు కాలేజీల్లో ఫీజు చెల్లించి, సెల్ఫ్ డిక్లరేషన్ చేయాల్సి ఉంది.
జాతీయ వార్తల్లోని హెడ్‌లైన్
5. బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్ పెరుగుతోంది. కేంద్రంలో బీజేపీకి మద్దతు ఇస్తోన్న నితీశ్‌కుమార్ చేస్తున్న విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. మోదీ తన మిత్రుడిపై కాస్తైన గౌరవం ఉంచి బిహార్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని మాజీ స్పీకర్ మీరా కుమార్ డిమాండ్ చేశారు.
6. భారీ వర్షాలకు ఉత్తర భారతం వణుకుతోంది. ముంబైలో ఎడతెరపిలేని వానలు కురుస్తున్నాయి. బిహార్‌లో పిడుగులు పడి ఒకే రోజు 25 మంది మరణించారు. పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు.
అంతర్జాతీయ వార్తల హెడ్‌లైన్
7. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో సవాళ్ల పర్వం కొనసాగుతోంది. బైడెన్ మతిమరుపు వ్యాధితో బాధపడుతున్నారన్న వార్తల నేపథ్యంలో అధ్యక్షుడు స్పందించారు. తాను వంద శాతం ఫిట్‌గా ఉన్నానని... కావాలంటే వైద్య పరీక్షలకు సిద్ధమని ప్రకటించారు. ఈ ప్రకటన అమెరికాలో కలకలం రేపింది.
రీసెర్చ్
8. అమెరికా పరిశోధక విద్యార్థులు సరికొత్త ఆవిష్కరణ చేసి అబ్బురపరిచారు. పాడైపోయిన అరటిపండ్లతో సైకిల్, కారు విడి భాగాలను తయారు చేసే విధానాన్ని రూపొందించారు. యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ విద్యార్థులు ఈ ఘనత సాధించారు.
క్రీడా వార్తలు
9. భారత్- జింబాబ్వే మధ్య నాలుగో టీ 20 ఇవాళ జరగనుంది. ఇప్పటికే 2-1 ఆధిక్యంలో ఉన్న టీమిండియా ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని జింబాబ్వే వ్యూహాలు రచిస్తోంది
10. మంచిమాట
ఎగిరే గాలిపటం విద్యార్థి అయితే దాని ఆధారమై ధారం గురువు
సర్వేపల్లి రాధాకృష్ణ