13th August 2024 School News Headlines Today:
నేటి ప్రత్యేకత:
ప్రపంచ ఎడమచేతి వాటం ప్రజల దినోత్సవం
ప్రముఖ సమాజ సేవకురాలు ఫ్లోరెన్స్ నైటింగేల్ మరణం
భారతీయ సినిమా నటి శ్రీదేవి జయంతి
ఆంధ్రప్రదేశ్ వార్తలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు సమావేశమయ్యారు. రెండు రోజులుగా రాజధాని అమరావతిలో నిర్మాణాలు పరిశీలిస్తున్న వారు... చంద్రబాబుతో భేటీ అయ్యారు. రాజధాని అమరావతి నిర్మాణం గురించి కీలక చర్చ జరిపారు. అమరావతి ప్రత్యేకతలను చంద్రబాబు వారికి వివరించారు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్ స్కూల్ బస్‌ల ఫిట్‌నెస్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. అన్నమయ్య జిల్లాలో స్కూల్ వ్యాను బోల్తాపడి చిన్నారి మృతి చెందడంపై సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్కూల్ బస్సుల ఫిట్ నెస్ పై రవాణా శాఖ అధికారులు డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు.
ఏపీ ప్రభుత్వానికి నిపుణుల కమిటీ కీలక సిఫారసులు చేయబోతోంది. జాబ్ క్యాలెండర్ విధానంలో ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీ చేపట్టాలని సూచించనుంది.
ప్రభుత్వం అధికారికంగా అనుమతించిన వాటికి ఆర్థిక శాఖ అనుమతి అవసరం లేదని నిపుణుల కమిటీ సూచించింది.
తెలంగాణ వార్తలు
తెలంగాణలో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా దక్షిణ కొరియాలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఆటోమోటివ్ దిగ్గజం హ్యుందాయ్ మోటార్ కంపెనీ ప్రతినిధులతో రేవంత్ చర్చలు జరపగా... మెగా కారు టెస్టింగ్ సెంటర్ ఏర్పాటుకు ఆ సంస్థ సిద్ధమైంది.
తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ కేంద్రం తెలిపింది. మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, అదిలాబాద్, ఆసిఫాబాద్, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని తెలిపింది.
జాతీయ వార్తలు
దేశవ్యాప్తంగా నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్స్ ఫ్రేమ్‌వర్క్ ర్యాంకింగ్స్ 9వ ఎడిషన్ వివరాలను కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. ఈ జాబితాలో దేశంలోనే టాప్ ఇంజినీరింగ్ కాలేజీగా ఐఐటీ మద్రాస్ నిలిచింది. ఇంజనీరింగ్ విభాగంలో ఎన్‌ఐటీ హైదరాబాద్ ఏడో స్థానంలో నిలిచింది.
కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లేఖ రాసింది. కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన నేపథ్యంలో కేంద్రం ముందు ఐఎంఏ పలు డిమాండ్లు పెట్టింది. హత్యాచార ఘటనలో విచారణ నిష్పక్షపాతంగా జరగాలని డిమాండ్ చేసింది. పని ప్రదేశాల్లో మహిళల భద్రతను మెరుగుపరచడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరింది.
అంతర్జాతీయ వార్తలు
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మధ్యంతర ప్రభుత్వం నుంచి పిలుపు వచ్చింది. బంగ్లాదేశ్‌కు తిరిగి రావాలని తాత్కాలిక ప్రభుత్వం షేక్ హసీనాకు సందేశం పంపింది. ప్రజలు ఆగ్రహానికి గురయ్యేలా ఎలాంటి ప్రకటనలు చేయవద్దని హసీనాకు.. కొత్త ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
క్రీడలు
పారిస్ ఒలింపిక్స్2024 విజేతలతో ఈనెల 15న ప్రధాని మోదీ భేటీ కానున్నారు. స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమం తర్వాత మధ్యాహ్నం 1 గంటకు ప్రధాని అథ్లెట్లందరినీ కలుసుకోవచ్చని తెలుస్తోంది. ఒలింపిక్స్ జులై 26 నుంచి ఈనెల 11 వరకు జరగ్గా.. భారత్ నుంచి117 మంది అథ్లెట్లు పాల్గొన్నారు.
మంచిమాట
ఎగిరే గాలిపటం విద్యార్థి అయితే... ఆధారమైన ధారం గురువు
సర్వేపల్లి రాధాకృష్ణ