Rude Kid On KBC 17 Goes Viral :   కౌన్ బనేగా కరోరేపతి (కేబీసీ) సీజన్ 17లో గుజరాత్‌కు చెందిన 10 ఏళ్ల చిన్నారి ఇషిత్ భట్ట్ హాట్ సీట్‌పై కనిపించిన ఎపిసోడ్ వైరల్ అవుతోంది. ఈ చిన్నారి ప్రవర్తనను 'రూడ్', 'ఓవర్‌కాన్ఫిడెంట్' అని నెటిజన్లు విమర్శిస్తున్నారు. అయితే, హోస్ట్ అమితాభ్ బచ్చన్ ఈ సమస్యను అద్భుతంగా హ్యాండిల్ చేశారని ఇంటర్నెట్ ప్రశంసలు కురిపిస్తోంది.  ఇషిత్   ప్రైజ్ మనీ గెలవకుండా షో నుంచి వెళ్లిపోయాడు.
 
గాంధీనగర్, గుజరాత్‌కు చెందిన 5వ తరగతి విద్యార్థి ఇషిత్ భట్ట్, అక్టోబర్ 9న జరిగిన కేబీసీ 17 ఎపిసోడ్‌లో హాట్ సీట్‌పై కనిపించాడు. ఏ మాత్రం సహనం లేకుండా మాట్లాడాడు. అమితాభ్ బచ్చన్ రూల్స్ వివరిస్తుంటే, ఇషిత్  నాకు రూల్స్ తెలుసు, ఇప్పుడు వాటిని వివరించకండి  అని చెప్పి అందరినీ  షాక్‌కుగురి చేశాడు.  ఆప్షన్లు ఇవ్వకముందే  ఆప్షన్లు ఇవ్వండి అని డిమాండ్ చేశాడు. లాక్ చేసేటప్పుడు  ఒక్కటి కాదు, నాలుగు లాక్‌లు పెట్టండి, కానీ లాక్ చేయండి అని  గదమాయించాడు.  

Continues below advertisement



రామాయణం సంబంధిత ప్రశ్న వాల్మీకి రామాయణంలో మొదటి కాండం పేరు ఏది అన్న ప్రశ్నకు సరైన సమాధానం 'బాల కాండం' అయినప్పటికీ, ఇషిత్ తప్పు సమాధానం ఇచ్చి ఏ ప్రైజ్ మనీ లేకుండా షో నుంచి వెళ్లాడు. ఈ క్లిప్ వైరల్ అయింది. 
 
అమితాభ్ బచ్చన్ చిన్నారి ప్రవర్తనపై ఏ మాత్రం అసహనం  వ్యక్తం చేయలేదు.  కొన్నిసార్లు చిన్నారులు ఓవర్‌కాన్ఫిడెన్స్‌తో తప్పులు చేస్తారు  అని  వ్యాఖ్యానించారు.  ఈ వీడియో వైరల్ కాగానే, చాలామంది ఇషిత్ ప్రవర్తనను 'అన్‌అక్సెప్టబుల్' అని విమర్శించారు. Xలో వేలాది పోస్టుల్లో "మోస్ట్ హేటెడ్ కిడ్ ఆన్ ఇంటర్నెట్" అని  ప్రచారం  చేశారు.   విలువలు   లేకుండా ప్రతి దాన్నీ ఇవ్వవచ్చు, కానీ  గౌరవం మర్చిపోతే అది పెద్దల తప్పిదమేనని ఆ బాలుడి తల్లిదండ్రులపై విమర్శలు చేశారు.  





  
కేబీసీ 17 TRPలు 1.6-1.8కి పడిపోయాయి, కానీ ఈ ఎపిసోడ్ వల్ల తాత్కాలికంగా 2.1కి పెరిగాయి.  ఇషిత్ ప్రవర్తన గతంలో 1 కోటి ప్రశ్నలో ఓవర్‌కాన్ఫిడెన్స్‌తో ఓడిపోయిన మరొక చిన్నారిని గుర్తు చేసింది. ఈ డిబేట్ చిన్నారులపై పబ్లిక్ స్క్రూటినీ, టాక్సిక్ పేరెంటింగ్‌పై చర్చలకు దారి తీసింది.