భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తదుపరి చీఫ్‌గా సీనియర్ శాస్త్రవేత్త ఎస్ సోమనాథ్‌ను కేంద్రం నియమించింది. ప్రస్తుతం విక్రంసారాభాయ్ అంతరిక్ష కేంద్రం డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు సోమనాథ్.
ప్రస్తుతం ఇస్రో ఛైర్మన్‌గా ఉన్న కే శివన్ పదవీ కాలం పూర్తయిన తర్వాత (జనవరి 12, 2022) ప్రపంచంలోని ప్రముఖ అంతరిక్ష సంస్థల్లో ఒకటైన ఇస్రోకి సోమనాథ్ అధిపతిగా వ్యవహరించనున్నారు.
ప్రొఫైల్..
- కొల్లాంలోని టీకేఎమ్ కళాశాలలో సోమ్‌నాథ్ బీటెక్ చదివారు.
- అనంతరం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc)లో మాస్టర్స్ పూర్తి చేశారు.
- ఆయన 1985లో ఇస్రోలో చేరారు. అనంతరం పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV)కి సంబంధించిన ప్రయోగాల్లో కీలకంగా వ్యవహరించారు.
- తిరువనంతపురంలోని లిక్విడ్ పొప్రల్షన్ సిస్టమ్స్ సెంటర్ (LPSC)కు 2015లో డైరెక్టర్‌గా సోమ్‌నాథ్ నియమితులయ్యారు.
- 2003లో GSLV Mk-III ప్రాజెక్టులో డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా సోమ్‌నాథ్ ఉన్నారు.
- 2010- 2014 వరకు సోమ్‌నాథ్ GSLV Mk-III ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు.
- 2014 డిసెంబర్ 18న ఆయన నేతృత్వంలోనే కేర్ మిషన్‌కు చెందిన తొలి ప్రయోగాత్మక విమానం విజయవంతమైంది.
ఇస్రో..
గగన్‌యాన్ కోసం క్రియోజనిక్ ఇంజిన్ క్వాలిఫికేషన్‌ను టెస్ట్‌ను విజయవంతంగా నిర్వహించింది ఇస్రో. తమిళనాడు మహేంద్రగిరిలోని ఐపీఆర్ఎస్‌లో 720 సెకన్ల పాటు ఈ పరీక్షను నిర్వహించింది.
Also Read: ABP CVoter Survey: యూపీకి యోగి, ఉత్తరాఖండ్‌కు హరీశ్ రావత్.. సీఎంలుగా వీళ్లే కావాలట!
Also Read: ABP C-Voter Survey: యూపీలో భాజపా హవా.. ఉత్తరాఖండ్‌లోనూ కాషాయం జోరు.. పంజాబ్‌లో మాత్రం!