Republic Day 2022 Live Updates: పూంఛ్ లోని నియంత్రణ రేఖ వద్ద త్రివర్ణ పతాకం రెపరెపలు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా వేడుకలకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
భారత ఆర్మీ జవాన్లు పూంఛ్ లోని నియంత్రణ రేఖ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి రిపబ్లిక్ వేడుకల్లో భాగస్వాములు అయ్యారు.
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవిండ్ బాడీ గార్డ్ గుర్రం విరాట్ నేడు రిటైర్ అయింది. ఈ ఏడాది విరాట్‌కు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ మెడల్ దక్కింది. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ప్రధాని మోదీలు విరాట్ రిటైర్మెంట్ కార్యక్రమానికి హాజరయ్యారు.
తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్ కే కేశవరావు జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి మహమూద్ అలీ, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, గెల్లు శ్రీనివాస్ యాదవ్, బండి రమేష్, లింగంపల్లి కిషన్ రావు, కట్టెల శ్రీనివాస్ యాదవ్, ఇతర టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు.
73వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసులు జాతీయ జెండాకు గౌరవ వందనం చేశారు. ప్రజలందరికీ సీఎస్ సమీర్ శర్మ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
73వ గణతంత్ర వేడుకల సందర్భంగా గూగుల్ కూడా ముఖ చిత్రాన్ని మార్పు చేసింది. ఢిల్లీలోని రాజ్ పథ్‌లో నిర్వహించే పరేడ్ కార్యక్రమాలను ప్రతిబింబించేలా గూగుల్ డిజైన్‌ను రూపొందించింది. ఏనుగులు, ఒంటెలతో పాటు పరేడ్‌కు అద్దం పట్టే అంశాలను అందులో చేర్చారు.
తిరుమలలో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా టీటీడీ అధికారులు నిర్వహించారు. గోకులంలోని అడిషనల్ ఈవో క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ వేడుకలకు టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని, జాతీయ జండాను ఎగుర వేసి జండా వందనం సమర్పించారు. అనంతరం ఉద్యోగులను ఉద్దేశించి ధర్మారెడ్డి మాట్లాడుతూ.. కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా ఉన్న సమయంలో కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించాంమని తెలిపారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహించామని, 10 రోజుల పాటు వైకుంఠ ద్వారా దర్శనం భక్తులకు కల్పించామని తెలిపారు.
తెలంగాణ రాజ్‌భవన్‌లో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి పలువురు ఉన్నాతాధికారులు పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం గవర్నర్ తమిళసై ప్రసంగించారు. ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు, రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళసై గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గణతంత్ర దినోత్సవ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగం మనదని, అత్యుత్తమ రాజ్యాంగం అందించిన దార్శనికులకు నివాళులర్పిస్తున్నాని తెలిపారు. వ్యాక్సినేషన్‌లో ప్రపంచంలోనే మనం ముందున్నందుకు గర్వంగా ఉందని గవర్నర్ తమిళసై పేర్కొన్నారు.
కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో గణతంత్ర వేడుకల నిర్వహణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. జనసమ్మర్దం లేకుండా, జనం గుమిగూడకుండా వేడుకలు నిర్వహించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ మినహా అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్లతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఉదయం 10 గంటలకు జాతీయ పతాకావిష్కరణ చేయాలని ఆదేశించింది.
Background
మరికొద్దిసేపట్లో దేశ వ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు అంతా పటిష్ఠంగా ఏర్పాట్లు చేశారు. రాజ్ పథ్‌లో కవాతుపై ఉగ్ర ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో, విజయ్ చౌక్ నుండి ఎర్రకోట వరకు, కవాతు మొత్తం మార్గాన్ని కంటోన్మెంట్‌గా మార్చారు. 71 మంది డీసీపీలు, 213 మంది ఏసీపీలు, 753 మంది ఇన్‌స్పెక్టర్లు ఆఫ్ ఢిల్లీ పోలీస్‌లకు పరేడ్ భద్రతను అప్పగించారు. పరేడ్ భద్రత కోసం 27 వేల 723 మంది జవాన్లు, కమాండోలు, ఢిల్లీ పోలీసుల షార్ప్ షూటర్లను మోహరించారు.
Also Read: కన్నార్పకుండా చూసేలా గణతంత్ర వేడుకలు.. ఈ సారి ఎన్నెన్ని విశేషాలో తెలుసా..?
ఈ జవాన్లకు సహాయం చేయడానికి, 65 కంపెనీ పర్మిట్రీ ఫోర్స్‌ను కూడా మోహరించారు. ఉగ్రవాదులు, దుండగులను అదుపు చేసేందుకు 200 విధ్వంస నిరోధక బృందాలను మోహరించారు. ఎలాంటి ముప్పు కలగకుండా భద్రత కోసం ఎన్‌ఎస్‌జి ప్రత్యేక బృందాలను కూడా పరేడ్ వేదిక చుట్టూ మోహరించారు. ఇంటెలిజెన్స్ ఏజెన్సీ హెచ్చరికతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. భూమి నుంచి ఆకాశం వరకు పర్యవేక్షణ జరుగుతోంది.
దాదాపు 2,700 మంది బలగాలను మోహరించారు. పోలీసులు ఉగ్రవాదుల పోస్టర్లను అతికించారు. యాంటీడ్రోన్ వ్యవస్థలు కూడా అమర్చారు. ఉగ్రవాదుల ముప్పు దృష్ట్యా ఢిల్లీని ఆనుకుని ఉన్న పొరుగు రాష్ట్రాల ఏజెన్సీలను కూడా అప్రమత్తం చేశారు. ఢిల్లీ పోలీసులు కూడా నిఘా సంస్థలతో నిరంతరం టచ్‌లో ఉన్నారు. అంతే కాదు హోటళ్లు, లాంజ్‌లు, ధర్మశాలల్లో నివసించే వారి వెరిఫికేషన్ కూడా జరిగింది.
దీనితో పాటు, ఢిల్లీలో కొత్తగా అద్దెకు దిగిన వారిపై కూడా పోలీసులు ఓ కన్నేసి ఉంచారు. ఢిల్లీలోని ఘాజీపూర్ మండిలో పేలుడు పదార్థాలు లభ్యం కావడంతో భద్రతా సంస్థలు భద్రత విషయంలో గతంలో కంటే మరింత అప్రమత్తమయ్యాయి.
Also Read: Gold-Silver Price: రిపబ్లిక్ డే నాడు ఎగబాకిన బంగారం.. వెండి నేల చూపులు, నేటి ధరలు ఇవే..
Also Read: Garikapati: ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావుకు పద్మశ్రీ
Also Read: Darshanam Mogilaiah: ఒక్క పాటతో విపరీత క్రేజ్ తెచ్చుకున్న వ్యక్తికి పద్మశ్రీ
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
- - - - - - - - - Advertisement - - - - - - - - -