Mysore Sri :  ఆపరేషన్ సిందూర్ తర్వాత దేశంలో ప్రజలంతా  పాకిస్తాన్ పై అసహ్యం వ్యక్తం చేస్తున్నారు.  ఈ క్రమంలో  కొంత మంది కరాచీ బేకరి అనే పేరు ఉందని ఆ బేకరీపై దాడులు చేశాడు. అప్పుడు కొంత మంది మీమర్స్ కు విచిత్రమైన ఆలోచన వచ్చింది. అదేమిటంటే.. మైసూర్ పాక్ స్వీట్ లోనూ పాక్ అనే పేరు ఉందని.. అర్జంట్ గా మైసూర్ భారత్ అని మార్చాలన్న డిమాండ్లు సరదాగా చేశారు. 

ఇలాంటి పేరుతో వైరల్ మీమ్స్ వచ్చాయి.  అందరూ సరదాగా తీసుకున్నారు కానీ.. ఓ రాజస్థాన్ వ్యాపారి మాత్రం ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నాడు. వెంటనే మైసూపర్ పాక్ పేరును మైసూర్ శ్రీ అని మార్చేసి .. అమ్మడం ప్రారంభించాడు.  

 ఆపరేషన్ సిందూర్  కోసం తన మద్దతుగను ఇలా చెబుతున్నానని ఆ మిఠాయి వ్యాపారి అంటున్నారు.  ప్రచారం కోసం ఇలా చేయడం లేదని..  దేశభక్తితోనే చేస్తున్నానని చెబుతున్నారు. 

మైసూర్ పాక్ మైసూరు రాజభవనంలో 19వ శతాబ్దంలో మహారాజా కృష్ణరాజ వడియార్ IV హయాంలో రాజ వంట మనిషి కాకాసుర మదప్ప తయారు చేశాడు.   ఈ స్వీట్‌ను శనగపిండి , నెయ్యి, చక్కెరతో తయారు చేస్తారు. దీనిని మొదట "మైసూర్ పాక"గా పిలిచారు. ఇక్కడ "పాక" అనేది చక్కెర సిరప్ లాంటిది. తెలుగులో పాకం అని పిలుస్తారు. ఇందులో పాక్ అని ఉందని పాకిస్తాన్ అని కాదని ఇలా పేరు మార్చడం సరికాదని కొంత మంది అంటున్నారు.