Rahul House : రాహుల్ గాంధీ  లోక్‌సభ సభ్యత్వం రద్దు కావడంతో  ఎంపీగా కేటాయించిన ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరించడంతో ఆయనకు పాత ఇల్లునే మళ్లీ కేటాయించారు.  గతంలో ఆయన నివసించిన 12, తుగ్లక్ లేన్ బంగళాను తిరిగి ఆయనకు ఇవ్వాలని లోక్‌సభ హౌస్ కమిటీ నిర్ణయించుకుంది. లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ జరగడంతో రాహుల్ గాంధీ  కి ఢిల్లీలో అధికారిక బంగళాను ప్రభుత్వం తిరిగి కేటాయించింది. గతంలో ఆయన నివసించిన 12, తుగ్లక్ లేన్ బంగళాను తిరిగి ఆయనకు ఇవ్వాలని లోక్‌సభ హౌస్ కమిటీ నిర్ణయించుకుంది.              


పరువునష్టం కేసులో పార్లమెంటు సభ్యత్వాన్ని రాహుల్ ఇటీవల కోల్పోవడంతో నిబంధనల ప్రకారం గత ఏప్రిల్ 22న రాహుల్ తన అధికారిక బంగళాను ఖాళీ చేశారు. ఆ వెంటనే తన తల్లి సోనియాగాంధీ 10 జనపథ్ రెసిడెన్స్‌లో ఆమెతో పాటే ఉంటున్నారు. రాహుల్‌కు తమ ఇంట్లో నివాసం కల్పించేందుకు పలువురు పార్టీ నేతలు మందుకు వచ్చారు. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన 'స్టే'తో రాహుల్‌పై పడిన అనర్హత వేటును లోక్‌సభ సెక్రటేరియట్ పునరుద్ధరించింది. దీంతో ఆయనకు ఇంతకుముందు కేటాయించిన బంగ్లానే తిరిగి లోక్‌సభ హౌస్ కమిటీ కేటాయించింది. ఎంపీగా అధికారిక నివాసాన్ని తిరిగి పొందడంపై రాహుల్‌ మీడియా ముందు స్పందించారు. యావత్ దేశం తన ఇల్లేనని చెప్పారు. రాహుల్ గాంధీ 12, తుగ్లక్ లేన్‌ బంగళాలో 2005 నుంచి గత ఏప్రియల్‌ వరకూ ఉన్నారు.                      
 
రాహుల్ గాంధీ 2004లో ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నుంచి మొదటి సారి లోక్‌సభ ఎన్నికల్లో గెలిచినప్పుడు ఆయనకు ఢిల్లీలో తుగ్లక్ రోడులో ఇల్లును  కేటాయించారు. అదే  ఇంట్లో రాహుల్ ఇప్పటివరకు కొనసాగుతున్నారు. అయితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి ఎంపీగా  గెలుపొందారు. అయితే కర్ణాటకలోని కోలార్‌లో 2019 ఎన్నికల ప్రచారం భాగంగా మోదీ ఇంటి పేరుపై చేసిన  వ్యాఖ్యలకు సంబంధించి గుజరాత్ మాజీ మంత్రి పూర్ణేష్ మోదీ ఆయనపై క్రిమినల్ పరువు నష్టం కేసు వేశారు. దీనిపై విచారణ జరిపిన సూరత్ కోర్టు.. ఈ ఏడాది మార్చి 23న రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. మరుసటి రోజే ఆయన లోక్‌సభ సభ్యునిగా అనర్హత వేటు పడింది. ఈ క్రమంలోనే ఆయన తన అధికారిక బంగ్లాను కూడా ఖాళీ చేయాల్సి వచ్చింది. 


రాహుల్ గాంధీ ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతారు. కేంద్రంపై ఇండియా కూటమి పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చలో ఆయన మాట్లాడతారని భావిస్తున్నారు. సూరత్ కోర్టు శిక్ష విధించినప్పటి నుంచి దాదాపుగా నాలుగు  నెలల పాటు ఆయన ఎంపీగా విధులు నిర్వహించలేకపోయారు.