Rahul Gandhi on Modi:


అదాని, ప్రధాని మధ్య రిలేషన్ ఏంటి: రాహుల్ గాంధీ


బ్రిటన్ పర్యటనలో రాహుల్ గాంధీ భారత్‌పై, మోదీ సర్కార్‌పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. భారత్‌ను కించపరిచారంటూ బీజేపీ తీవ్రంగా మండి పడుతోంది. ఇటీవలే ఆ పర్యటన ముగించి వచ్చిన రాహుల్ గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్  ఏర్పాటు చేశారు. తనపై బీజేపీ చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. మోదీ హయాంలో నిజంగా ప్రజాస్వామ్యమనేదే ఉంటే...కచ్చితంగా తనకు పార్లమెంట్‌లో మాట్లాడే అవకాశం వచ్చి ఉండేదని సెటైర్లు వేశారు. ఇదే సమయంలో గౌతమ్ అదాని, ప్రధాని మధ్య రిలేషన్ ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. తాను పార్లమెంట్‌లోకి వచ్చిన మరు నిముషమే సభను వాయిదా వేస్తారని విమర్శించారు.


"నాకు మాట్లాడే హక్కు ఉంది. ఆ హక్కుని ప్రజాస్వామ్యం కల్పించింది. నిజంగా దేశంలో డెమొక్రసీ ఉంటే నేను పార్లమెంట్‌లో మాట్లాడగలిగే వాడిని. ఇది నిజంగా మన దేశ ప్రజాస్వామ్యానికి పరీక్ష. అదానీ అంశంపై మేం పదేపదే ప్రశ్నిస్తున్నాం. అందుకే మోదీ సర్కార్ భయపడుతోంది. ఇకపై నాకు పార్లమెంట్‌లో మాట్లాడేందుకు అనుమతి దొరకకపోవచ్చు. మోదీ, అదానీ మధ్య సంబంధం ఏంటి అనేదే నా ప్రశ్న. అదానీ అంశంపై నేను చేసిన వ్యాఖ్యల్ని తప్పుదోవ పట్టించారు. ప్రజలకు తెలియాల్సిన సమాచారాన్ని దాచేందుకే ఇలాంటి కుట్రలు చేస్తున్నారు. నేను ఇవాళ ఉదయం పార్లమెంట్‌లో మాట్లాడేందుకు ప్రయత్నించాను. నలుగురు మంత్రులు నా ప్రసంగాన్ని అడ్డుకున్నారు. నాపై ఆరోపణలు చేశారు. కొద్ది రోజుల క్రితం నేను పార్లమెంట్‌లో అదానీ అంశం గురించి మాట్లాడాను. దాన్ని రికార్డుల నుంచి తొలగించారు. "


- రాహుల్ గాంధీ