AP Agriculture Budget : ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ బడ్జెట్ ను రూ.41436 కోట్ల వ్యయంతో  ప్రవేశ పెట్టారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్దెట్‌లో భాగంగా వ్యవసాయ పద్దును ప్రకటించారు. ఆ పద్దును ఏ ఏ విధలుగా ఖర్చు  పెడతారో వ్యవసాయ పద్దు ద్వారా కాకాణి గోవర్థన్ రెడ్డి వివరించారు. రైతు భరోసా పథకం కింద ఇప్పటివరకూ రూ.6940 కోట్లు అందించినట్లు మంత్రి కాకాణి తెలిపారు. రైతులకు యూనివర్శల్ బీమా కల్పించిన ఏకైక రాష్ట్రం మనదేనన్నారు. ఏపీ సీడ్స్ కు జాతీయ స్ధాయిలో అవార్డులు వస్తున్నాయన్నారు. విత్తనాల రాయితీకి రూ.200 కోట్లు కేటాయించామని, ఆర్బీకేల ద్వారా రూ.450 కోట్ల ఎరువుల సరఫరా చేస్తున్నామన్నారు. ఆర్బీకేల్లో 50 వేల టన్నుల ఎరువుల్ని నిల్వ చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో 6.01 లక్షల కోట్ల రైతు రుణాలిచ్చామని, దీంతో 9 లక్షల మందికి మేలు జరిగిందన్నారు.                 


రాష్ట్రంలో వ్యవసాయ సలహా మండళ్లు ఏర్పాటు చేశామని, 3.5 లక్షల మంది సన్నకారు రైతులకు సబ్సిడీపై స్పేయర్లు అందించామని కాకాణి పేర్కొన్నారు. డ్రోన్లతో పురుగుమందులు పిచికారీ చేయిస్తున్నామన్నారు. ఆర్బీకేల ద్వారా రైతులకు 10వేల డ్రోన్లు అందిస్తున్నామన్నారు. చిరు ధాన్యాల సమగ్ర సాగు విధానం తీసుకొచ్చి, హెక్టార్ కు 6 వేలు ప్రోత్సాహకం ఇస్తున్నామన్నారు. పట్టు పరిశ్రమ ప్రగతి పథంలో నిలిపామని, ధరల స్ధిరీకరణ నిధితో రైతుల్ని ఆదుకుంటున్నామని కాకాణి తెలిపారు వ్యవసాయ బడ్డెట్ లో రైతు భరోసా కేంద్రాల వద్ద బ్యాంకింగ్ సదుపాయాలు కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. రైతులకు కావాల్సిన అన్ని సేవల్ని గ్రామాల్లోనే అందిస్తున్నామని, వారి ఆదాయం పెంచేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఆర్బీకేలను మరింత పటిష్టంచేసేలా అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. వీటిని మరింతగా రైతుల్లోకి తీసుకెళ్లేందుకు యూట్యూబ్ ఛానళ్లు, మాసపత్రికలు ప్రారంభించినట్లు కాకాణి వెల్లడించారు.               


అంతకు ముందు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2 లక్షల 79 వేల కోట్లతో ఏపీ బడ్జెట్‌ ప్రవేశ పెట్టారు.   రెవెన్యూ లోటు 22,316 కోట్లుగా పేర్కొన్నారు. ప్రగతికి అవసరమైన నాలుగు ప్రధాన అంశాలను ఆధారంగా చేసుకొని 2023-24 సంవత్సరానికి ఏపీ బడ్జెట్ కోసం కేటాయింపులు చేసినట్టు పేర్కొన్నారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. సుస్థిర అభివృద్ధి, జవాబుదారీతనం, ప్రతిస్పందన, పారదర్శకత సమాన అవకాశాలతో కూడీన  సుపరిపాలనకు దారి తీస్తుందన్నారు బుగ్గన. తమ పార్టీ మేనిఫెస్టోనే ఆ సూత్రాలకు అనుగుణంగా రూపొందించిందని గుర్తు చేశారు. అందుకే స్థిరమైన అభివృద్ధితో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఉందని చెప్పారు. ఏపీ బడ్జెట్ 2023లొ పాఠశాల విద్యకు అధిక ప్రాధ్యాన్యం ఇచ్చారు. ఇదుకోసం రూ. 29,690 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించింది. అలాగే ఉన్నత విద్య కోసం రూ. 2,064 కోట్లు కేటాయింపులు జరిపింది.