Queen Elizabeth Death:


పలు చోట్ల సగమే ఎగురుతున్న జెండా 


బ్రిటన్ రాణి మృతికి అన్ని దేశాల అధ్యక్షులు సంతాపం ప్రకటించారు. క్వీన్‌తో ప్రత్యేక అనుబంధం ఉన్న భారత్‌..ఆమె గౌరవార్థం...ఈ రోజు సంతాప దినం పాటించాలని నిర్ణయించింది. ఈ సంతాప దినంలో భాగంగా...దేశంలోని కీలక ప్రాంతాల్లో జాతీయ జెండాను సగమే ఎగరేశారు. ఎర్రకోట, రాష్ట్రపతి భవన్ సహా పలు చోట్ల ఇది పాటిస్తున్నారు.





బ్రిటన్‌కు రాజుగా ప్రిన్స్ ఛార్లెస్-III బాధ్యతలు చేపట్టారు. క్వీన్ ఎలిజబెత్-II అంత్యక్రియలు ఈ నెల 19వ తేదీన జరగనున్నాయి.  లండన్‌లోని వెస్ట్‌మిన్స్‌టర్  అబే (Westminster Abbey)లో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. అంతకు ముందు వెస్ట్‌మిన్స్‌టర్‌లోనే రాణి భౌతిక కాయాన్ని నాలుగు రోజుల పాటు ఉంచనున్నారు. ప్రజలు వచ్చి ఆమె భౌతిక కాయాన్ని సందర్శించుకుని నివాళి అర్పించుకోవచ్చు అని రాయల్ ఫ్యామిలీ ప్రకటించింది. కొద్ది రోజుల్లోనే బల్మోరల్ నుంచి ఆమె భౌతిక కాయాన్ని ముందుగా ఎడిన్‌బర్గ్‌కు తరలిస్తారు. తరవాత అక్కడి నుంచి లండన్‌కు తీసుకురానున్నారు. ఆమె అంత్యక్రియలు జరిగే రోజుని సెలవు దినంగా ప్రకటించారు..ప్రిన్స్ ఛార్లెస్. 


కింగ్ ఛార్లెస్ బాధ్యతలు..


లండన్‌లో సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌లో జరిగిన అక్సెషన్ కౌన్సిల్‌లో (Accession Council) కింగ్ ఛార్లెస్ -IIIను కొత్త మోనార్కీగా బాధ్యతలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో క్వీన్ కన్సోర్ట్ క్యామిల్లా, ప్రిన్స్ ఆఫ్ వేల్స్ విలియం, ప్రధాని లిజ్ ట్రస్‌తో సహా మరికొందరు హాజరయ్యారు. అక్సెషన్‌ కౌన్సిల్‌ సమక్షాన ఛార్లెస్‌కు రాచరికపు అధికారాలను అప్పగించారు. ఈ బాధ్యతలు చేపడుతున్నట్టుగా సంతకాలు కూడా చేశారు ప్రిన్స్ ఛార్లెస్. డ300 ఏళ్లకు పైగా రాచరికపు బాధ్యతలు చేపట్టే ప్రక్రియను బయట ప్రజలకు తెలియకుండా ఎంతో అధికారికంగా చేసేవారు. ఇప్పుడు తొలిసారి ప్రజల సమక్షంలో ఈ ప్రక్రియ నిర్వహించారు. ఈ ప్రాసెస్‌ను లైవ్‌ కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా కింగ్ ఛార్లెస్ భావోద్వేగంగా మాట్లాడారు. "డార్లింగ్ మామా" అంటూ తన తల్లిని గుర్తు చేసుకున్నారు. "ఆమె మరణం నన్ను శోకంలోకి నెట్టేసింది. ఆమె లేని లోటు తీర్చలేనిది. ఆమె పంచిన ప్రేమ మాకు ఎన్నో విషయాల్లో మార్గదర్శకంగా నిలిచింది. 21 ఏళ్ల వయసులోనే తన జీవితాన్ని దేశానికి అంకితం చేస్తున్నట్టు ప్రతిజ్ఞ చేశారు. అది కేవలం ప్రతిజ్ఞగా మిగిలిపోలేదు. ఆమె ఎంతో నిబద్ధతగా దాన్ని నెరవేర్చారు. ఇందుకోసం ఆమె ఎన్నో త్యాగాలు చేశారు. ఇప్పుడామె వెళ్లిపోయాక వారసత్వాన్ని కొనసాగించే బాధ్యత నాకు దక్కింది. ఈ బాధ్యత నా జీవితంలో ఎన్నో మార్పులకు కారణమవుతుందని తెలిసినా...ఆమె ఆశయానికి అనుగుణంగా నా జీవితాన్ని కూడా దేశానికి అంకితం చేస్తానని మాటిస్తున్నాను. ఈ సందర్భంగా నా తల్లికి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా...థాంక్యూ" అని చాలా ఎమోషనల్ అయ్యారు ప్రిన్స్ ఛార్లెస్. ప్రిన్స్‌ ఛార్లెస్ రాచరిక బాధ్యతలు చేపట్టిన సందర్భంగా...ప్రముఖ టిబెటియన్ ఆధ్యాత్మిక గురువు ప్రత్యేక సందేశం పంపారు. రాచరిక బాధ్యతలను పూర్తి నిబద్ధతతో, నిజాయతీతో నిర్వహిస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు. 


Also Read: Long Covid: లాంగ్ కోవిడ్ లక్షణాలు కనిపిస్తే ఈ ఆహారాలకు దూరంగా ఉండాలి


Also Read: Krishnam Raju Political Career: రాజకీయాల్లోనూ రెబల్ స్టార్, ఓడిన చోటే నెగ్గి కేంద్ర మంత్రి అయిన కృష్ణంరాజు