Bhagwant Mann Photo:


పంజాబ్‌లో ఘటన..


పంజాబ్‌ కొద్ది రోజులుగా నిత్యం వార్తల్లో నిలుస్తోంది. అక్కడి మొహల్లా క్లినిక్‌లే ఇందుకు కారణం. కేంద్ర ప్రభుత్వం పెట్టిన హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్‌ స్కీమ్‌ను మార్చేసి...ఆమ్‌ఆద్మీ మొహల్లా క్లినిక్‌లు మార్చేస్తున్నారంటూ కేంద్రమంత్రి మన్‌సుఖ్ మాండవియా ఆరోపించారు. అప్పటి నుంచి పంజాబ్ ప్రభుత్వానికి, కేంద్ర ఆరోగ్య శాఖకు వాగ్వాదం నడుస్తోంది. ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. గురుదాస్‌పూర్ బటాలాలోని ఆమ్‌ఆద్మీ క్లినిక్ బయట పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఫోటోను ఎవరో దొంగిలించారు. ఉన్నట్టుండి కనిపించకుండా పోవడం హాట్‌టాపిక్ అయింది. జనవరి 27న భగవంత్ మాన్, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ రాష్ట్రవ్యాప్తంగా 500 మొహల్లా క్లినిక్‌లు ప్రారంభించారు. అప్పటి నుంచి వివాదాలు మొదలయ్యాయి. ఇలాంటి తరుణంలో హాస్పిటల్ ఆవరణలోని సీఎం ఫోటో ఫ్రేమ్‌ను ధ్వంసం చేసి ఆ ఫోటోను దొంగిలించడం అలజడి రేపింది. ఉన్నతాధికారులు ఈ అంశాన్ని చాలా తీవ్రంగా పరిగణించారు. వెంటనే అన్ని మొహల్లా క్లినిక్‌ల వద్ద సెక్యూరిటీ గార్డ్‌లను నియమించాలంటూ ఆదేశాలిచ్చారు. అటు పోలీసులు కూడా విచారణ మొదలు పెట్టారు. ఇప్పుడే కాదు. గతంలోనూ ఇలాంటి సంఘటనలు జరిగాయి. అమృత్‌సర్, బఠిండా ప్రాంతాల్లోని క్లినిక్‌ల వద్దా సీఎం ఫోటోలను దొంగిలించారు. ఇప్పటి వరకూ ప్రభుత్వం దీనిపై స్పందించలేదు. 


బీజేపీపై విమర్శలు..


పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఇటీవలే తెలంగాణ పర్యటనకు వచ్చారు. బీఆర్ఎస్ నేతృత్వంలో జరిగిన ఖమ్మం భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. బీజేపీ అంటే భారతీయ జుమ్లా పార్టీ  అని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ విమర్శించారు. బీజేపీ చేస్తోంది లోక్‌ తంత్ర కాదని లూట్ తంత్రా.   యువతకు, రైతులకు, మహిళలకు ఇచ్చిన హామీలేవీ నెరవేర్చలేదు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు నెరవేర్చలేదు. రైతులు ఆదాయాలు రెట్టింపు చేస్తామని మోసం చేశారని విమర్శించారు. ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో ఆయన ప్రసంగించారు.  ప్రజల ఖాతాల్లో రూ. 15 లక్షలు వేస్తామన్నారు. ఇంత వరకు వేయలేదు. దిల్లీ మున్సిపల్ ఎన్నికల్లోనూ కుట్రలు చేశారు. లూటీ చేయడం అమ్మడమే బీజేపీ సిద్ధాంతమని  భగవంత్‌ సింగ్‌ మాన్‌ విమర్శించారు. విపక్షాల ఎమ్మెల్యేలను కొనాలి.. అధికారంలోకి రావాలి ఇదే బీజేపీ సూత్రం అని పంజాబ్ సీఎం మండిపడ్డారు.  అన్ని సమయాలు ఒకేలా ఉండవని, రాజు బికారి అవుతాడని, బికారి రాజు అవుతాడని బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దేశమనే పుష్ఫగుచ్ఛంలో అన్ని రకాల పువ్వులు ఉంటేనే బాగుంటుందన్నారు. కానీ కొందరు ఒకే రకమైన పువ్వును కోరుకుంటున్నారని విమర్శించారు.దొడ్డి దారిలో అధికారంలోకి రావడంలో బీజేపీ నంబర్‌ వన్‌ అని ... మోదీ ప్రజల కోసం కాదు తన మిత్రుల కోసం పని చేస్తున్నారని అన్నారు. ఎర్రకోటపై మోదీ 8 ఏళ్లుగా ఒకేరకమైన మాటలు చెబుతున్నారని విమర్శించారు. ప్రజల జీవితాలను మోదీ ఎలాగూ మార్చలేకపోతున్నారని, కనీసం తన ప్రసంగాన్నైనా మార్చుకోవాలని సూచించారు.


Also Read: B'luru Traffic: 10 కి.మీ. ప్రయాణానికి 29 నిమిషాలు, లండన్ తర్వాత అత్యంత రద్దీ ఉండేది ఇక్కడే