Amritpal Singh Arrested:
అరెస్ట్‌కు రెడీ..
ఖలిస్థాన్ వేర్పాటువాది అమృత్ పాల్ సింగ్‌ను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఆయన అనుచరులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. రెండు వాహనాలనూ స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్ పోలీసులు అతడిపై మూడు కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాంటి అలజడులూ చెలరేగకుండా ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవల్ని బంద్ చేసింది. రేపు మధ్యాహ్నం 12 గంటల వరకూ ఇంటర్నెట్ సేవలు, SMS సర్వీసులు అందుబాటులో ఉండవని స్పష్టం చేసింది. మెర్సిడెస్ కార్‌ను వదిలేసి వేరే కార్‌ను కొనుగోలు చేసిన అమృత్ పాల్ సింగ్..చాలా రోజులుగా అండర్‌గ్రౌండ్‌లో ఉంటున్నాడు. అతడిని అరెస్ట్ చేయాలంటూ చాలా రోజులుగా ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. ఆ మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టి అతడిని అదుపులోకి తీసుకునేందుకు సిద్ధమవుతోంది.