TDP leaders press meet : సెమీ ఫైనల్స్‌లో విజయం సాధించామని ఇక తెలుగుదేశం పార్టీకి తిరుగులేదని ఆ పార్టీ నేతలు విశాఖలో మీడియా సమావేశం పెట్టి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి మెథడ్ లో పాలన సాగలేదు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శించారు. డిస్ట్రక్షన్ మోడ్ లో వైసీపీ పరిపాలన సాగించిందన్నారు. జగన్ కూల్చివేతలతో పాలన మొదలుపెట్టారని... అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటివరకు జరిగిన అనేక ఎన్నికల్లో అక్రమాలతో గెలిచారన్నారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు వైసీపీ అగ్రనేతలు మోహరించి అనేక రకాల అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. అయినా పట్టభద్రులు వైసీపీని నమ్మలేదని గుర్తు చేశారు.
ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ టీడీపీ గెలుపుతో వైసీపీ పతనం ప్రారంభం : గంటా
మొదటి ప్రాధాన్యత లోనే టీడీపీ అభ్యర్థి గెలుస్తారని భావించామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికతో వైసీపీ పతనం ప్రారంభమైందన్నారు. టీడీపీ అద్భుతమైన విజయం సాధిస్తే అధికార పార్టీ పేపర్ కి కనిపించలేదన్నారు. ఈ ఎన్నికల్ని సెమి ఫైనల్ గా బావించామని.. అద్భుత విజయం సాధించామని గంటా శ్రీనివాసరావు సంతోషం ్యక్తం చేసారు. కేపిటల్ ముసుగులో విశాఖలో అనేక అక్రమాలకు పాల్పడ్డారని టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావు వైసీపీ నేతలపై మండిపడ్డారు. గంగవరం పోర్టుని ఆదానికి అప్పనంగా అప్పగించారని.. స్టీల్ ప్లాంట్ ని కాపాడుకునే ప్రయత్నం వైసీపీ చేయలేదన్నారు. వైసీపీ చేసిన దుర్మార్గాలను పట్టభద్రులు గుర్తుంచుకున్నారని ... తగిన రీతిలో జగన్ కి పట్టభద్రులు బుద్ధిచెప్పారన్నారు.
రాజధాని పేరుతో మోసగించాలని చూశారు : బండారు
రాజధాని పేరుతో మోసాగించాలని జగన్ కలలు కన్నారని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి వివరించారు. గ్లోబల్ సమ్మిట్ నిర్వహించి లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని.. ఆరు లక్షలమందికి ఉద్యోగాలు అని చెప్పినా వైసీపీని నమ్మలేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుతో పట్టభద్రులు జెల్లకొట్టారని ఇప్పటికైనా వైసీపీ నేతలు నిజాయితీగా ఉండాలన్నారు.
టీడీపీ ప్రభుత్వం కోసం ప్రజలు కోరుకుంటున్నారు : వేపాడ
ఏపీ ప్రజలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నట్లుగా రుజువైందని.. ఎమ్మెల్సీగా గెలిచిన వేపాడ చిరంజీవి రావు ప్రకటించారు. ఈ గెలుపులో 98 శాతం తెలుగుదేశంపార్టీ రెండు శాతం తన గుర్తింపు సహకరించాయన్నారు. తన దగ్గర చదువుకున్న విద్యార్థులు, వారి తల్లి తండ్రులు తనను గెలిపించారు అన్నారు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన వేపాడ చిరంజీవి. తన సేవలు నచ్చడం. వారు తనపై విశ్వాసం ఉంచడం వల్ల తాను గెలిచానని భావిస్తున్నారు. ప్రజలు టీడీపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.