Pune IAS Trainee Officer: పుణేలోని IAS ట్రైనీ పూజా ఖేడ్కర్ వ్యవహారం (Pune IAS Trainee) దేశవ్యాప్తంగా సంచలనమవుతోంది. గొంతెమ్మ కోరికలు కోరుతూ హోదాకి తగ్గట్టుగా వ్యవహరించకుండా విమర్శలు ఎదుర్కొంటోంది ఈ ఆఫీసర్. ఇప్పటికే ఆమెపై బదిలీ వేటు వేశారు అధికారులు. ఈ క్రమంలోనే ఆమెకి సంబంధించి (Pooja Khedkar) కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అసిస్టెంట్ కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకోకముందే అందరిపైనా హుకుం చేసింది. అంతే కాదు. పుణే జిల్లా కలెక్టర్‌నే ఇబ్బంది పెట్టింది. అసిస్టెంట్ కలెక్టర్ కాకముందే ప్రత్యేకంగా కార్‌, ఇల్లు కావాలని డిమాండ్ చేసింది. అది వర్కౌట్ కాకపోవడం వల్ల ప్రైవేట్ ఆడీ కార్‌కి సైరన్ తగిలించింది. ఆ తరవాత Government of Maharashtra స్టికర్‌నీ అంటించింది. VIP నంబర్ ప్లేట్‌ పెట్టించింది. అడిషనల్ కలెక్టర్‌ లేని సమయాన్ని చూసి ఆయన ఛాంబర్‌నే ఆక్రమించింది. 24 నెలల పాటు ప్రొబేషన్‌ పీరియడ్‌లో ట్రైనింగ్‌లో ఉండే వాళ్లని జూనియర్ ఆఫీసర్‌లుగానే పరిగణిస్తారు. వాళ్లకి ఇలాంటి ప్రత్యేక వసతులు ఏమీ ఉండవు. అయినా సరే అవన్నీ కావాల్సిందేనని పట్టుబట్టింది పూజా ఖేడ్కర్. 


కళ్లు సరిగ్గా కనిపించవట..


అయితే..మరో సంచలన విషయమూ తెలిసింది. ఆమెకి కళ్లు (Puja Khedkar) సరిగ్గా కనిపించవని, మానసిక స్థితి కూడా సరిగ్గా లేదని UPSCకి సబ్మిట్ చేసిన అఫిడవిట్‌లో ఉంది. రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా, ఇలా ఏదో లోపం ఉన్నట్టు చూపించారు. అయితే...తప్పనిసరిగా పరీక్షలు చేసిన తరవాతే రిక్రూట్ చేసుకుంటామని అధికారులు ఆమె అప్లికేషన్‌ని రిజెక్ట్ చేశారు. దాదాపు 6 సార్లు ఇలానే వెనక్కిపంపారు. ఎగ్జామ్‌ రాయడానికే కుదరదని తేల్చినప్పుడు ఆమె ఈ పోస్ట్‌కి ఎలా రిక్రూట్ అయిందనేదే అంతు తేలని విషయం. అయితే..ప్రస్తుతం తెలిసిన వివరాల ఆధారంగా చూస్తే 2022లో ఏప్రిల్‌లో ఆమె మెడికల్ టెస్ట్‌లు చేయించుకుంది. ఢిల్లీలోని AIIMSలో ఈ టెస్ట్‌లు జరిగాయి. కొవిడ్ పాజిటివ్ వచ్చినా ఎలాగోలా మేనేజ్ చేసేసింది. ఆ తరవాత మరి కొన్ని కీలక టెస్ట్‌లు చేయించుకోవాల్సి ఉన్నా వాటినీ స్కిప్ చేసింది. ఇంత జరిగినా ఆమె చివరకు రిక్రూట్ అయింది. ఇదే ఎలా జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 


డిమాండ్‌లు..


ఇక OBC అని చెప్పుకుని రిక్రూట్‌ అయినట్టూ తెలిసింది. కానీ ఆమె తండ్రికి రూ.40 కోట్ల ఆస్తి ఉందని, అలాంటి వాళ్లు OBC కిందకు ఎందుకు వస్తారని కొందరు ప్రశ్నిస్తున్నారు. రిక్రూట్‌మెంట్‌లో ఏదో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్నారు. రిక్రూట్ అయ్యాక రకరకాల డిమాండ్‌లు పెడుతూ అధికారులకు తలపోటు తీసుకొచ్చిం పూజా ఖేడ్కర్. అందుకే వెంటనే పుణే నుంచి వాషిం జిల్లాకి ట్రాన్స్‌ఫర్ చేశారు. మానసిక స్థితి బాలేదని చెప్పి రిక్రూట్ అయినప్పుడు అందుకు తగిన ఆధారాలు చూపించారా అన్నదీ అంతు చిక్కడం లేదు. ఇలా ఈ వ్యవహారంలో ఎన్నో చిక్కుముడులున్నాయి. వీటన్నింటిపైనా అధికారులు దృష్టి సారించారు. ఇప్పటికైతే బదిలీ వేటు వేసినప్పటికీ..తరవాత ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నదే ఉత్కంఠగా మారింది. 


Also Read: School Bus Accident: అదుపు తప్పి బోల్తాపడిన బస్సు, పెద్ద ఎత్తున మంటలు - విద్యార్థులు సజీవదహనం