Pariksha Pe Charcha: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం పరీక్షా పే చర్చ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఢిల్లీలోని తాల్కటోరా ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో... విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో ప్రధాని మోదీ ముచ్చటించారు. ఈ సందర్బంగా విద్యార్థులతో సమయపాలన గురించి మాట్లాడారు. రోజూ ఇంట్లో అమ్మను చూస్తే సమయపాలన ఎలా నిర్వహించుకోవాలో మనకు తెలుస్తుందన్నారు. ఇక ఈ కార్యక్రమంపై ఇంతకుముందు ప్రధాని ట్విట్టర్ లో స్పందించారు. ఈరోజు ఇలా చిన్నారుల మధ్యం ఉండడం చాలా సందోషంగా ఉందని తెలిపారు. అలాగే సామాజిక హోదా కారణంగా తల్లిదండ్రులు పిల్లలపై ఒత్తిడి తీసుకురావద్దని పరీక్షా పే చర్చా కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 






'పరీక్ష పే చర్చ' సందర్భంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ప్రధాని మోదీ సమాధానాలు ఇచ్చారు. విద్యార్థులు తమ పనిపై దృష్టి పెట్టడానికి ప్రయత్నించాలని అన్నారు. పరీక్షల్లో కాపీ కొట్టడం.. వంటివి చేసి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. ఒకటి, రెండు పరీక్షల్లో కాపీయింగ్ చేయడం వల్ల జీవితంలో ఎలాంటి ప్రయోజనం ఉండదని అన్నారు. విద్యార్థులు ఎప్పుడూ "షార్ట్‌కట్" మార్గంలో వెళ్లొద్దని ఆయన చెప్పారు. విద్యార్ధుల ఇప్పుడు పడుతున్న శ్రమతోనే ఎప్పుడూ ముందుకు సాగాలని సూచించారు. 


ఒత్తిడిని తగ్గించుకోవడంపై దృష్టి..


విద్యార్థులు తమ శక్తిని తక్కువ అంచనా వేస్తున్నారో లేదో తెలుసుకోవడానికి తమపై వస్తున్న ఒత్తిడిని చాలాసార్లు విశ్లేషించుకోవాలని ప్రధాని మోదీ అన్నారు. కుటుంబ సభ్యులకు అంచనాలు ఉండటం సహజమే కానీ అది సామాజిక వర్గానికి లేదా హోదాకు సంబంధించినదైతే అది తప్పని చెప్పుకొచ్చారు. ఫోర్లు మరియు సిక్సర్లు డిమాండ్ చేసే ప్రేక్షకుల గొంతులను విస్మరించి ఒక బ్యాట్స్‌మన్ బౌల్ చేసిన బంతిపై ఏకాగ్రత పెడుతున్నట్లే, విద్యార్థులు కూడా తమ పనిపై దృష్టి పెట్టాలని వివరించారు. 


38 లక్షల మంది విద్యార్థుల హాజరు..


"పరీక్ష పే చర్చ"లో పాల్గొనేందుకు ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో 38 లక్షల మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపిన వివరాల ప్రకారం గతేడాది కంటే కనీసం 15 లక్షల మంది విద్యార్థులు ఈ సారి చర్చలో పాల్గొనేందుకు పేరు నమోదు చేసుకున్నారు. అలాగే ఆయా రాష్ట్రాల్లోని విద్యార్థులు ఈ కార్యక్రమంలో వర్చువల్ గా పాల్గొనగా.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ కార్యక్రమాన్ని వీక్షించారు.