Breaking News: జాబ్ నోటిఫికేషన్లపై సీఎం కేసీఆర్‌కు ఏఐసీసీ ఇంచార్జి మాణిక్కమ్ ఠాగూర్ ట్వీట్

Breaking News Live Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

ABP Desam Last Updated: 24 Apr 2022 11:48 AM

Background

ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్, తెలంగాణ సీఎం కేసీఆర్‌తో హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో భేటీ అయ్యారు. కాంగ్రెస్‌ అధిష్ఠానం సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో వరుస భేటీలు అయిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ శనివారం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో భేటీ...More

Job Notificationsపై సీఎం కేసీఆర్‌కు ఏఐసీసీ ఇంచార్జి మాణిక్కమ్ ఠాగూర్ ట్వీట్

తెలంగాణ సీఎం కేసీఆర్ ఉద్యోగాలపై ప్రకటన చేసి 45 రోజులు అవుతున్నా, ఇంతవరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ జారీ కాకపోవడంపై కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణ యువతకు ఉద్యోగాలు రాకుండా ఎన్ని ఏళ్ళు ఆపగలరు, మీ కొడుకులాగే తెలంగాణ బిడ్డలను మీరు భావించాలి కదా.. అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రశ్నిస్తూ ఏఐసీసీ ఇంచార్జి మాణిక్కమ్ ఠాగూర్ ట్వీట్ చేశారు.