Power Cut During President's Speech: 


ఒడిశాలో ఘటన 


ఒడిశాలోని మహారాజ శ్రీ రామ చంద్ర భన్‌జదియో యూనివర్సిటీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించే సమయంలో ఉన్నట్టుండి పవర్ కట్ అయింది. ఒక్కసారిగా హాల్ అంతా చీకటైపోయింది. హైసెక్యూరిటీ ఉన్న హాల్‌లో కరెంట్ పోవడం అందరినీ టెన్షన్ పెట్టింది. రాష్ట్రపతి అలా ప్రసంగం మొదలు పెట్టారో లేదో వెంటనే హాల్‌లోని లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోయాయి. ద్రౌపది ముర్ముతో పాటు అందరూ షాక్ అయ్యారు. కానీ ముర్ము మాత్రం ప్రసంగాన్ని కొనసాగించారు. మైక్‌కి పవర్ సప్లై కట్ అవ్వకపోవడం వల్ల అలా చీకట్లోనే ఆమె ప్రసంగించారు. ఏసీ కూడా బాగానే పని చేసింది. చాలా సేపటి వరకూ లైట్‌లు వెలగలేదు. హాల్‌లో ఉన్న వారంతా చీకట్లోనే ఉన్నారు. ద్రౌపది ముర్ము స్పీచ్‌ని అలాగే విన్నారు. కరెంట్ మనతో హైడ్ అండ్ సీక్ ఆటలు ఆడుతోందంటూ ద్రౌపది ముర్ము అందరినీ నవ్వించారు. ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో రాయ్‌రంగ్‌పూర్‌కు చెందిన రాష్ట్రపతి అదే రాష్ట్రంలో పర్యటించడం ఆసక్తికరంగా మారింది. అయితే...ఆమె ప్రసంగించే సమయంలో కరెంట్ పోవడంపై అధికారులు వివరణ ఇచ్చారు. పవర్ సప్లైలో ఎలాంటి సమస్యా లేదని తేల్చి చెప్పారు. మరి ఎందుకిలా జరిగిందని ఆరా తీయగా...ఎలక్ట్రికల్ వైరింగ్‌లో డిఫెక్ట్‌ ఉన్నట్టు గుర్తించారు. యూనివర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్ సంతోష్ కుమార్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఇలా జరిగినందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి క్షమాపణలు చెప్పారు. 


"ఇలా జరుగుతుందని అనుకోలేదు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని ఇబ్బంది పెట్టినందుకు క్షమాపణలు చెబుతున్నాను. ఈ తప్పుకి బాధ్యత నేనే వహిస్తున్నాను. పవర్ ఫెయిల్యూర్ అవడం చాలా ఇబ్బందిగా అనిపించింది. కచ్చితంగా దీనిపై విచారణ జరుపుతాం. ఇందుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. అధికారులతోనూ సంప్రదించి ఆరా తీస్తాం."


- వైస్‌ ఛాన్స్‌లర్ 


క్షమాభిక్ష పిటిషన్‌ తిరస్కరణ..


మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ (Mercy Petition) ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) తిరస్కరించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌ సమాచారం ఇచ్చింది. ఈ విషయం దేశ వ్యాప్తంగా ఇప్పుడు సంచలనం అయింది. మే 3, 2017న వసంత్ సంపత్ దుపారే (అప్పటికి 55 సంవత్సరాలు) అనే వ్యక్తి క్షమాభిక్ష పిటిషన్‌ (Mercy Petition) ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. కింది కోర్టు వేసిన మరణశిక్షను సమర్థించింది. 25 జూలై 2022న దేశ 15వ రాష్ట్రపతి అయిన తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరస్కరించిన మొదటి క్షమాభిక్ష పిటిషన్ ఇది. ఈ క్షమాభిక్ష పిటిషన్‌పై ఈ ఏడాది మార్చి 28న రాష్ట్రపతి భవన్ కు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసింది. తాజాగా రాష్ట్రపతి ఆ పిటిషన్‌ను తిరస్కరించారు. మహారాష్ట్రలో 2008లో నాలుగేళ్ల బాలికపై అత్యాచారం చేసి రాళ్లతో కొట్టి చంపిన కేసులో వసంత్ సంపత్ దుపారే (Vasanth Sampath Dupare) అనే వ్యక్తి దోషిగా తేలాడు. 2008లో మహారాష్ట్రలో ఓ నాలుగేళ్ల బాలిక అత్యాచారానికి గురై, హత్యకు గురైంది. 


Also Read: హిందూ అమ్మాయిని దత్తత తీసుకున్న ముస్లిం దంపతులు, హిందూ సంప్రదాయం ప్రకారమే పెళ్లి