గేమింగ్ ఫోన్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ పోకో నుంచి గేమింగ్ ఫోన్‌ వచ్చేసింది. పోకో ఎఫ్ 3 జీటీ (Poco F3 GT) పేరున్న ఈ ఫోన్ భారతదేశంలో విడుదల అయింది. దీని ప్రారంభ ధర రూ.26,999గా ఉంది. గేమింగ్ కోసం ప్రత్యేకంగా ఇందులో ట్రిగ్గర్లను అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 1200 (5జీ) ప్రాసెసర్ ఆధారంగా పనిచేస్తుంది. గన్‌మెటల్ సిల్వర్, ప్రిడేటర్ బ్లాక్ కలర్స్‌లో లభిస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 12.5 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తుంది. 
వేరియంట్లు.. ధర..
ఇందులో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.26,999గా.. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.28,999గా.. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.30,999గా నిర్ణయించారు.   




గేమ్స్ ఆడేవాళ్లకు పండగే..
గేమ్స్ ఆడే వారి కోసం పోకో ఎఫ్ 3 జీటీ కొత్త ఫీచర్ తెచ్చింది. ఫోన్ పైభాగంలో చివరివైపున రెండు స్లైడర్స్‌ అందించింది. వీటిని జరిపితే ట్రిగ్గర్స్ యాక్టివేట్ అవుతాయి. గేమ్స్ బాగా ఆడేవారికి ఈ ట్రిగ్గర్స్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి.  గతంలో పోకో నుంచి వచ్చిన మోడల్స్‌తో పోలిస్తే ఈ ఫోన్ డిజైన్ వినూత్నంగా ఉంది.  


వన్‌ప్లస్ నుంచి విడుదలైన నార్డ్ 2 5జీ (One Plus Nord 2 5G)కి ఈ ఫోన్ గట్టి పోటీ ఇవ్వనుంది. వన్‌ప్లస్ నార్డ్ 2 5జీ ఫోన్‌లో మూడు వేరియంట్లు ఉన్నాయి. వీటి ధరలు రూ.27,999 నుంచి ప్రారంభం అవుతాయి.
స్పెసిఫికేషన్లు



  • పోకో ఎఫ్ 3 జీటీ డిస్‌ప్లే 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ టర్మో అమోఎల్ఈడీతో వస్తుంది.

  • స్క్రీన్ రిజల్యూషన్ 1080 X 2400 పిక్సెల్స్‌గా ఉంటుంది. 

  • స్క్రీన్ రీఫ్రెష్ రేట్ 120 HZగా, టచ్ శాంప్లింగ్ రేట్ 480HZగా ఉంది.

  • గొరిల్లా గ్లాస్ 5తో పాటు హెచ్‌డీఆర్ 10 ఉండనుంది. 

  • మీడియాటెక్ డైమెన్సిటీ 1200 (5జీ) ప్రాసెసర్ మీద పనిచేస్తుంది.  

  • 8 జీబీ ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్‌ అందించింది.

  • హెచ్‌డీఆర్10+ సపోర్ట్‌తో వస్తుంది.   




  • డాల్బీ అట్మాస్‌తో పాటు డ్యూయల్ స్పీకర్లు కూడా ఉంటాయి. 

  • లిథియం అయాన్ పాలిమర్ తో తయారైన బ్యాటరీ కెపాసిటీ 5065 ఎంఏహెచ్ గా ఉంది. 

  • 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది.

  • వెనకవైపు మూడు కెమెరాలు ఉంటాయి. 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా + 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా + 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి.

  • ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.

  • దీని బరువు 205 గ్రాములుగా ఉంది.

  • ఫ్లిప్‌కార్ట్‌లో వీటిని కొనుగోలు చేయవచ్చు.