Punjab National Bank Alert: పంజాబ్ నేషనల్ బ్యాంక్ దేశంలో రెండో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు. దీనికి దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఖాతాదారులు ఉన్నారు. తన ఖాతాదారులకు ఎప్పటికప్పుడు వివిధ రకాల సేవలు, ఖాతా సంబంధింత సమాచారాన్ని PNB అందిస్తూనే ఉంటుంది. ఇటీవల, KYCని (Know Your Customer) వీలైనంత త్వరగా అప్‌డేట్ (PNB KYC Update) చేయమని సూచిస్తూ తన కస్టమర్‌లకు ఒక హెచ్చరికను పంజాబ్ నేషనల్ బ్యాంక్ జారీ చేసింది.
ఈ నెల 12 వరకే గడువు
పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతాదారులు, వారి KYCని అప్‌డేట్ చేయకపోతే ఆ ఖాతాను బ్యాంక్ క్లోజ్ చేస్తుంది. KYC అప్‌డేషన్ కోసం ఈ నెల (డిసెంబర్ 2022) 12వ తేదీ వరకే గడువు ఉంది. ఈ సమాచారాన్ని ఇప్పటికే SMS, ఈ-మెయిల్స్ ద్వారా ఖాతాదారులకు పంపింది. ఇదే సమాచారాన్ని వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కూడా బ్యాంక్ ప్రకటించింది. మీరు పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్ అయి ఉండి, KYC అప్‌డేషన్ పూర్తి చేయకపోతే, వీలైనంత త్వరగా ఆ పనిని పూర్తి చేయండి.
KYCని ఎందుకు అప్‌డేట్ చేయాలి?
డిసెంబర్ 12, 2022 గడువు లోపు KYC పూర్తి చేయని వాళ్లు బ్యాంకింగ్ విషయంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. మీ ఖాతాకు సంబంధించి మీరు ఎలాంటి లావాదేవీలను మీరు నిర్వహించలేరు. KYC పూర్తి కాని ఖాతాల లావాదేవీలను బ్యాంక్ నిలిపివేసే ప్రమాదం ఉంది. మీకు అలాంటి సమస్య రాకూడదు అనుకుంటే, ఇప్పుడే KYC పూర్తి చేయండి. మరికొన్ని రోజులు గడువు ఉంది కదాని ఆగితే, చివర్లో బ్యాంక్ సర్వస్ సహకరించకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో మీకు ఇబ్బందులు తప్పవు.
KYCకి సంబంధించి RBI నుంచి ఆదేశాలు
బ్యాంక్ కస్టమర్ల చేత ఆయా ఖాతాలకు సంబంధించిన KYCని అప్‌డేట్ చేయించమని దేశంలోని అన్ని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఎప్పటికప్పుడు ఆదేశిస్తూనే ఉంది. RBI ఆదేశాలు ఉన్నాయి కాబట్టి, KYC పూర్తి చేయడం బ్యాంక్ కస్టమర్లందరికీ ఇప్పుడు తప్పనిసరి. ఈ నేపథ్యంలో, KYCని అప్‌డేట్ చేయమంటూ PNB తన కస్టమర్‌లకు తరచూ సలహా ఇస్తోంది. అలా చేయని వారి ఖాతా మీద తాత్కాలికంగా నిషేధం విధించవచ్చు.
KYC ఇప్‌డేట్ ఇలా చేయవచ్చు
KYCని అప్‌డేట్ చేయడానికి, మీకు సమీపంలోని PNB శాఖకు వెళ్లండి. మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ పాస్‌బుక్‌ను మీతో పాటు తీసుకువెళ్లండి. KYC పత్రంలో ఆయా వివరాలను నింపండి. దీని తర్వాత, మీ ఈ-మెయిల్ ID, మొబైల్ నంబర్ వంటి వివరాలను కూడా ఆ పత్రంలో పూరించాలి. ఆ పత్రాన్ని సంబంధిత బ్యాంక్ ఉద్యోగికి ఇస్తే, ఆయన మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్‌ను, KYC పత్రంలో నింపిన వివరాలను సరిపోల్చుకుని KYCని అప్‌డేట్ చేస్తారు. ఇది కాకుండా, మీకు ఏదైనా ఫోన్ కాల్ లేదా సందేశం వస్తే, వాటి ద్వారా KYC పూర్తి చేయడానికి ప్రయత్నించవద్దు. అలా చేస్తే మీరు సైబర్ మోసానికి గురవుతారు.