Modi US Visit LIVE: అమెరికా పర్యటన ముగించుకొని భారత్‌కు మోదీ తిరుగుపయనం
ఐక్యరాజ్యసమితి 76వ జనరల్ అసెంబ్లీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు.
ABP Desam
Last Updated:
25 Sep 2021 10:35 PM
భారత్‌కు పయనం..
అమెరికా పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ.. భారత్‌కు తిరుగు పయనమయ్యారు. జాన్ ఎఫ్ కెన్నెడీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరారు.
భారీ ఎత్తున ప్రవాస భారతీయులు..
న్యూయార్క్‌లో ప్రధాని మోదీ బస చేసిన హోటల్ బయట ప్రవాస భారతీయులు పెద్ద ఎత్తున వేచిఉన్నారు. వారిని మోదీ ఆత్మీయంగా పలకరించారు. జాన్ ఎఫ్ డీ కెన్నెడీ అంతర్జాతీయ విమానాశ్రయానికి మోదీ కాసేపట్లో చేరుకోనున్నారు. అక్కడి నుంచి భారత్‌కు తిరుగు పయనమవుతారు.
అఫ్గాన్‌కు సాయం చేయాలి..
" అఫ్గాన్ గడ్డ ఉగ్రవాదానికి అడ్డా కాకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ సీమాంతర ఉగ్రవాదం విస్తరించకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. అఫ్గాన్‌లో బలహీన పరిణామాలను ఉపయోగించుకుని ఉగ్రవాదాన్ని పెంచి పోషించాలనుకునే దేశాలతో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. అఫ్గాన్ ప్రజలు, మహిళలు, చిన్నారులు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. వారికి సాయం అందించాలి. "
- ప్రధాని నరేంద్ర మోదీ
Background
భారత్‌లో బలమైన ప్రజాస్వామ్యం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఐరాస జనరల్ అసెంబ్లీలో ప్రసంగించిన ఆయన.. ఓ ఛాయ్‌వాలా ఇక్కడ మాట్లాడుతున్నాడంటే భారత ప్రజాస్వామ్యం ఎంత బలమైనదో అర్థం చేసుకోవచ్చన్నారు.
- - - - - - - - - Advertisement - - - - - - - - -