Mann Ki Baat Last Episode 2023:


మన్‌కీ బాత్ ఎపిసోడ్..


ఈ ఏడాదిలో చివరి మన్‌కీబాత్‌ ఎపిసోడ్‌లో (Modi Mann Ki Baat) కీలక విషయాలు ప్రస్తావించారు ప్రధాని నరేంద్ర మోదీ. సంవత్సర కాలంలో భారత్ సాధించిన విజయాల్ని గుర్తు చేశారు. 2023లో ఆత్మనిర్భర భారత్‌కి అడుగులు పడ్డాయని వచ్చే ఏడాదిలోనూ ఈ ప్రయాణం కొనసాగాలని ఆకాంక్షించారు. దేశం అంతకంతకూ ఆత్మ విశ్వాసాన్ని పెంచుకుంటోందని స్పష్టం చేశారు. ఇదే సమయంలో Fit India ఉద్యమం గురించీ ప్రస్తావించారు. ఫిజికల్  ఫిట్‌నెస్‌తో పాటు మానసిక ఆరోగ్యమూ ముఖ్యమే అని అభిప్రాయపడ్డారు ప్రధాని. గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌ రోజుకి కనీసం 7-8 గంటల పాటు నిద్రపోతారని, ఆయన మానసిక ఆరోగ్యంపై అంతగా దృష్టి పెడతారని ఉదాహరణ చెప్పారు. చంద్రయాన్‌ 3 విజయం అందరికీ గర్వకారణం అని ప్రశంసించారు. భారత్ ఈ విజయం సాధించినందుకు అందరూ తనకు అభినందనలు తెలుపుతున్నారని, తనలాగే దేశ ప్రజలందరూ సంతోషంతో ఉప్పొంగిపోతున్నారని అన్నారు ప్రధాని. ఈ ఏడాదిలో భారత్ క్రీడారంగంలోనూ దూసుకుపోయిందని ప్రశంసించారు. Asian Gamesలో అథ్లెట్స్ 107 మెడల్స్ సాధించడం చాలా గొప్ప విషయమని కొనియాడారు. వరల్డ్ కప్‌ మ్యాచ్‌లలోనూ భారత్‌ చాలా గొప్పగా రాణించిందని ప్రశంసలు గుప్పించారు. వచ్చే ఏడాది పారిస్‌లో ఒలింపిక్స్ జరగనున్నాయని, వాళ్లందరినీ ప్రోత్సహించాల్సిన అవసరముందని స్పష్టం చేశారు. 






AI గురించి ప్రస్తావన..


మన్‌కీ బాత్‌ ఎపిసోడ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ గురించీ ప్రస్తావించారు. దాదాపు అన్ని రంగాల్లోనూ ఈ సాంకేతికత వినియోగం పెరిగిందని అన్నారు. హిందీ నుంచి తమిళంలోకి అనువదించే AI Bhashini App గురించి మాట్లాడారు. ఇలాంటి సాంకేతికత వల్ల ఎన్నో సవాళ్లను దాటవచ్చని వెల్లడించారు. విద్యారంగంలోనూ ఇది మార్పులు తెస్తుందని ఆకాంక్షించారు. అయోధ్య రామ మందిర నిర్మాణం గురించీ మాట్లాడారు ప్రధాని. జనవరి 22న జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. రాముడిపై ఉన్న భక్తిని చాటుకునేందుకు కవితలు,పద్యాలతో రామ భజన చేయాలని పిలుపునిచ్చారు.