PM Modi Speech:


ప్రధాని నరేంద్ర మోదీ కొత్త పార్లమెంట్‌లో ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. ప్రతి దేశ చరిత్రలో కీలకమైన క్షణాలు ఉంటాయని, ఇప్పుడది చూస్తున్నామని వెల్లడించారు. ఇది కేవలం భవనం కాదని, 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు, కలలకు ప్రతిబింబం. భారత దేశ ప్రజాస్వామ్యానికి ఇది "ఆలయం" అనే సందేశాన్ని ప్రపంచానికి ఇద్దాం. దేశ ప్రజలకు అభినందనలు. ఈ కొత్త భవనం...స్వాతంత్య్ర సమర యోధుల కలల్ని ప్రతిఫలించేందుకు వేదికగా మారుతుంది. ఇది ఆదర్శమైన భవనం. కొత్త దారులు వెతుక్కున్నాం. కొత్త ఆలోచనలున్నాయి. ఇది ఆత్మనిర్భరతకు నిదర్శనం. భారత్‌...ప్రజాస్వామ్యానికి తల్లిలాంటిదని అన్నారు. ప్రజాస్వామ్యం అనేది కేవలం ఓ వ్యవస్థ కాదని, అదో సంప్రదాయం అని అన్నారు. పవిత్రమైన సెంగోల్‌కి సముచిత గౌరవం దక్కినందుకు ఆనందం వ్యక్తం చేశారు.