PM Modi On Pakistan: తనలో రక్తం కాదు.. వేడి సిందూరం ఉప్పొంగుతోందని ప్రధాని మోదీ అన్నారు. గురువారం రాజస్థాన్‌లోని బికనీర్‌లో జరిగిన సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భావోద్వేగ పూరిత ప్రసంగం చేశారు. ఏప్రిల్ 22న కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులను చంపినందుకు ప్రతీకారంగా పాకిస్తాన్‌లోని తొమ్మిది అతిపెద్ద ఉగ్రవాద స్థావరాలను కేవలం 22 నిమిషాల్లో భారత్ నాశనం చేసిందన్నారు. "సిందూర్ పేలుడు పదార్థంగా మారినప్పుడు, ఫలితం అందరికీ కనిపిస్తుంది" అని ప్రధాని మోదీ కవితాత్మకంగా చెప్పారు. ప్రతి ఉగ్రవాద దాడికి పాకిస్తాన్ సైన్యం , దాని ఆర్థిక వ్యవస్థ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని భారతదేశం స్పష్టం చేసిందని ఆయన అన్నారు.
18 రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలలోని 86 జిల్లాల్లో 103 పునరాభివృద్ధి చెందిన అమృత్ స్టేషన్లను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ప్రసంగించారు. "భారతదేశానికి హక్కుగా రావాల్సిన నీటిని పాకిస్తాన్ పొందదు, భారతీయుల రక్తంతో ఆడుకున్నందుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది" అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. "ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ఆపరేషన్ సిందూర్ మూడు సూత్రాలను నిర్ణయించింది. మొదట, భారతదేశంలో ఉగ్రవాద దాడి జరిగితే, వారికి తగిన సమాధానం లభిస్తుంది. మన దళాలు సమయం, పద్ధతి ,యు పరిస్థితులను నిర్ణయిస్తాయి. రెండవది, భారతదేశం అణు బాంబు బెదిరింపులకు భయపడబోదు. మూడవది, ఉగ్రవాదులకు, వారిపై ఆధారపడిన ప్రభుత్వాలకు మధ్య తేడాను మేము గుర్తించము..." అని మోదీ స్పష్టం చేశారు. సిందూరం చెరిపేయడానికి బయలుదేరిన వారు మట్టిలో కూరుకుపోయారు... భారతదేశ రక్తాన్ని చిందించిన వారి లెక్కలు తేల్చబడ్డాయి. భారతదేశం మౌనంగా ఉంటుందని భావించిన వారు నేడు తమ ఇళ్లలో దాక్కున్నారు. తమ ఆయుధాల గురించి గొప్పగా చెప్పుకున్న వారు నేడు దాని శిథిలాలలో కూరుకుపోయారని అన్నారు.
బికనీర్‌లోని నల్ విమానాశ్రయంపై దాడి చేయడానికి పాకిస్తాన్ ప్రయత్నించిందన్నారు. కానీ వారు ఎటువంటి నష్టాన్ని కలిగించలేకపోయారు. పాకిస్తాన్‌లోని రహీమ్ యార్ ఖాన్ వైమానిక స్థావరం సరిహద్దుకు ఆవల ఉంది. అది తిరిగి ఎప్పుడు పనిచేస్తుందో ఎవరికీ తెలియదు. అది ఐసియులో ఉంది. భారత సైన్యం దాడి దానిని నాశనం చేసిందని మోదీతెలిపారు. పాకిస్తాన్‌తో వాణిజ్యం, దా చర్చలు ఉండవు. పిఓకెపై మాత్రమే చర్చలు ఉంటాయి. పాకిస్తాన్‌కు భారతదేశం నుండి నీరు లభించదు... భారతదేశం రక్తంతో ఆడుకున్నందుకు వారు మూల్యం చెల్లించుకోవలసి ఉంటుంది. ఇది భారతదేశం తీర్మానమన్నారు. ప్రపంచంలోని ఏ శక్తి కూడా ఈ తీర్మానం నుండి మనల్ని కదిలించలేదని మోదీ స్పష్టం చేశారు.