Elon Musk Congratulates PM Modi: మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోదీకి టెస్లా సీఈవో ఎలన్ మస్క్ కంగ్రాట్స్ చెప్పారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు. భారత్‌లో టెస్లా అడుగు పెట్టడంపై చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని వెల్లడించారు. 

Continues below advertisement


"నరేంద్ర మోదీజీ మీకు అభినందనలు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలోని ఎన్నికల్లో మీరు ఘన విజయం సాధించారు. భారత్‌లో మా కంపెనీలు అద్భుతాలు సృష్టించాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను"


- ఎలన్ మస్క్, టెస్లా సీఈవో 




ఈ ట్వీట్‌కి నరేంద్ర మోదీ స్పందించారు. ఎలన్ మస్క్‌కి థాంక్స్ చెప్పారు. టెస్లాకు అనుకూలమైన వాతావరణం భారత్‌లో ఉందని, నైపుణ్యమున్న మా దేశ యువత మీ కోసం ఎదురు చూస్తోందని ఎలన్ మస్క్‌కి రిప్లై ఇచ్చారు. సుస్థిర ప్రభుత్వం ఉన్న తమ దేశంలో వ్యాపారానికి ఎప్పుడూ సరైన వాతావరణమే ఉంటుందని స్పష్టం చేశారు. పరోక్షంగా టెస్లాకి ఆహ్వానం పలికారు. 


"అభినందనలు తెలిపినందుకు మీకు నా ధన్యవాదాలు. మా దేశ యువత, అద్భుతమైన పాలసీలు, సుస్థిరమైన ప్రభుత్వం వ్యాపారానికి అనుకూలమైన వాతావరణాన్ని తప్పకుండా అందిస్తుంది"


- ప్రధాని నరేంద్ర మోదీ