Modi Oath Ceremony: ప్రధాని నరేంద్ర మోదీతో పాటు దాదాపు 30 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. కేబినెట్‌లో కీలక మంత్రిత్వ శాఖలన్నీ బీజేపీ వద్దే ఉన్నాయి. హోం మంత్రిగా అమిత్‌ షా, రక్షణశాఖ మంత్రిగా రాజ్‌నాథ్ సింగ్, రోడ్డు రవాణా శాఖ మంత్రిగా నితిన్ గడ్కరీ కొనసాగున్నారు. వాళ్ల మంత్రిత్వశాఖల్లో ఎలాంటి మార్పులూ చేయలేదు. దాదాపు 45 నిముషాల పాటు సాగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవాళ ప్రమాణ స్వీకారం చేయాల్సిన మంత్రులకు ఉదయం నుంచే ఫోన్ కాల్స్ వెళ్తున్నాయి. ఇటు తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కీ ఫోన్ కాల్స్ రావడం ఆసక్తి కలిగిస్తోంది. వీళ్లిద్దరికీ కేబినెట్‌లో బెర్త్ కన్‌ఫమ్‌ అయినట్టుగా తెలుస్తోంది. ఇవాళ ప్రమాణస్వీకారం చేయనున్న వాళ్లలో కొందరి పేర్లు బాగా వినిపిస్తున్నాయి. ఈ జాబితాలో నితిన్ గడ్కరీ, పియూష్ గోయల్, రాజ్‌నాథ్ సింగ్, జ్యోతిరాదిత్య సింధియా, హెచ్‌డీ కుమారస్వామి, అమిత్‌ షా సహా పలువురు కీలక నేతలున్నారు. 

మోదీ కేబినెట్ ఇదే..!

నితిన్ గడ్కరీరాజ్‌నాథ్ సింగ్పియూష్ గోయల్కిరణ్ రిజిజుహెచ్‌డీ కుమారస్వామిజ్యోతిరాదిత్య సింధియారామ్‌నాథ్ ఠాకూర్చిరాగ్ పాశ్వాన్జితిన్ రామ్ మంజిరామ్మోహన్ నాయుడుచంద్రశేఖర్ పెమ్మసానిఅనుప్రియ పటేల్ జయంత్ చౌదరిప్రతాప్ రావు జాదవ్ 

ANI వెల్లడించిన వివరాల ప్రకారం ఈ కార్యక్రమానికి జేపీ నడ్డా, బీఎల్ వర్మ, పంకజ్ చౌదరి, శివరాజ్ సింగ్ చౌహాన్, అర్జున్ రామ్ మేఘ్వాల్‌ హాజరు కానున్నారు. అయితే..మోదీ కేబినెట్‌లో ఈ సారి నడ్డాకి కూడా అవకాశం దక్కుతుందని వార్తలు వస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.