Surat Diamond Bourse inauguration: 


సూరత్ డైమండ్ బోర్స్ ప్రారంభం..


గుజరాత్‌లోని సూరత్‌లో ప్రపంచంలోనే అతి పెద్ద డైమండ్ సెంటర్ Surat Diamond Bourse ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సెంటర్ ప్రపంచంలోనే అతి పెద్దదే కాకుండా అత్యాధునికమైంది కూడా. వజ్రాల వ్యాపారానికి ప్రసిద్ధి చెందిన సూరత్‌లోనే ఈ సెంటర్ ఏర్పాటు చేయడం వల్ల రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటి వరకూ ఇప్పటి వరకూ ప్రపంచంలోనే అతి పెద్ద కార్యాలయ సముదాయం పెంటగాన్‌లో ఉంది. ఇప్పుడా రికార్డుని బద్దలు కొట్టింది సూరత్‌లోని డైమండ్ బోర్స్ కార్యాలయం. ప్రపంచంలో చెలామణీ అవుతున్న 90% మంది వజ్రాలను సానబెట్టే ప్రక్రియ సూరత్‌లోనే జరుగుతోంది. బంగారు నగలకూ సూరత్‌ ఫేమస్. వజ్రాల ఎగుమతులు, దిగుమతులకు సంబంధించిన కస్టమ్స్ క్లియరెన్స్ కూడా ఆ ఆఫీస్‌లోనే జరగనుంది. దీంతో పాటు ఇంటర్నేషనల్ బ్యాంకింగ్‌కీ అవకాశం కల్పించనుంది. 






ఈ సెంటర్‌తో పాటు సూరత్‌ ఎయిర్‌పోర్ట్‌లో కొత్త టర్మినల్ బిల్డింగ్‌నీ ప్రారంభించారు ప్రధాని మోదీ. అంతకు ముందు రోజు ఆయన ట్విటర్‌లో ఓ పోస్ట్ పెట్టారు. సూరత్ డైమండ్ ఇండస్ట్రీ ఎంత అభివృద్ధి చెందిందో చెప్పడానికి ఈ డైమండ్ బోర్స్ కార్యాలయమే నిదర్శనం అని కొనియాడారు. దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ఇది ఎంతగానో తోడ్పడుతుందని ఆకాంక్షించారు. దీంతో పాటు ఎయిర్‌పోర్ట్‌ టర్మినల్ బిల్డింగ్‌ ఫొటోలనూ షేర్ చేశారు.






ప్రత్యేకతలివే..


అత్యాధునిక సౌకర్యాలతో కూడిన సూరత్ డైమండ్ బోర్స్ కార్యాలయ నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.3,400 కోట్లు కేటాయించింది. సూరత్‌కి సమీపంలోని ఖజోడ్ గ్రామంలో దీన్ని నిర్మించారు. 34.54 ఎకరాలకుపైగా విస్తీర్ణంలో నిర్మాణం చేపట్టారు. 20 అంతస్తుల చొప్పున మొత్తం 4,500 కార్యాలయాలు ఈ కాంప్లెక్స్‌లో ఉంటాయి. 46 వేల టన్నుల ఉక్కుతో నిర్మించారు. 128 లిఫ్ట్‌లు ఏర్పాటు చేశారు.