PM Modi Breaks Down: 


సోలాపూర్‌లో పర్యటన..


మహారాష్ట్రలోని సోలాపూర్‌లో ప్రధాని మోదీ పర్యటించారు. Pradhan Mantri Awas Yojana-Urban Scheme లో భాగంగా నిర్మించిన ఇళ్లను కేటాయించే కార్యక్రమానికి హాజరయ్యారు. దాదాపు 15 వేల మంది లబ్ధిదారులకు ఈ ఇళ్లు అందజేశారు. వీళ్లలో చేనేత కార్మికులు, చిన్న వ్యాపారులు, బీడీ కార్మికులు, చెత్త ఏరుకునే వాళ్లు ఉన్నారు. వీళ్లకు సొంతిల్లు నిర్మించి ఇచ్చినందుకు ఆనందం వ్యక్తం చేసిన ప్రధాని..అదే సమయంలో భావోద్వేగానికి లోనయ్యారు. తన బాల్యంలో ఇలాంటి ఇంట్లో నివసించే అవకాశం వచ్చి ఉంటే ఎలా ఉండేదో అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ సమయంలో ఆయన గొంతు కూడా ఒక్కసారిగా మారిపోయింది. కనీసం ఈ కార్మికులైనా ఆ అదృష్టం లభించిందని అన్నారు. 


"ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా దేశంలోనే అతి పెద్ద హౌజింగ్ సొసైటీని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. నా చిన్నతనంలో నేను కూడా ఇలాంటి ఇంట్లో ఉండే అవకాశం వచ్చుంటే బాగుండేది. వేలాది కుటుంబాల సొంతింట కల నెరవేర్చినందుకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ల ఆశీర్వాదాలే నాకు ఆస్తులు"


- ప్రధాని నరేంద్ర మోదీ






గత పదేళ్లలో తమ ప్రభుత్వం పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పలు పథకాలు అమల్లోకి తీసుకొచ్చిందని అన్నారు ప్రధాని మోదీ. మూడోసారీ తామే అధికారంలోకి వస్తామన్న ధీమా వ్యక్తం చేశారు. భారత దేశ ఆర్థిక వ్యవస్థను మరింత ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. 


"మూడోసారి కూడా మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్న ధీమా ఉంది. మేం అధికారంలోకి వచ్చాక భారతదేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే మూడో స్థానానికి తీసుకెళ్తాం. ఇది నేను ప్రజలకు ఇస్తున్న హామీ"


- ప్రధాని నరేంద్ర మోదీ






సోలాపూర్‌లో ప్రధాని మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. మహారాష్ట్రలో AMRUT ప్రాజెక్ట్‌ల కోసం రూ.2 వేల కోట్లు కేటాయించింది కేంద్రం. ఆవాస్ యోజన కింద నిర్మించిన 90 వేల ఇళ్లను లబ్ధిదారులకు అందించారు. 


Also Read: ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కి విమానాల రాకపోకలు బంద్,ఆంక్షలు విధించిన ప్రభుత్వం