Delhi Airport Operations:


రిపబ్లిక్ డే వరకూ ఆంక్షలు..


జనవరి 26వ తేదీ వరకూ ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కి విమానాల రాకపోకలపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఉదయం 10.20 నిముషాల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకూ ఈ ఆంక్షలు వర్తించనున్నాయి. ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. గణతంత్ర దినోత్సవ వేడుకలను దృష్టిలో పెట్టుకుని భద్రతా పరంగా ఎలాంటి సమస్యలు రాకుండా ఈ నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే అత్యంత బిజీగా ఉండే ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ నుంచి దాదాపు రెండు గంటల పాటు సేవల్ని నిలిపివేయడం ఆర్థికంగా నష్టం కలిగించినప్పటికీ భద్రతే ప్రాధాన్యతనిస్తోంది ప్రభుత్వం. వచ్చే వారం భారత్ 75వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోనుంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. రిపబ్లిక్ డే పరేడ్‌లో (Republic Day 2024) పాల్గొననున్నారు. తొలిసారి BSF తరపున పూర్తిగా మహిళలే మార్చ్ నిర్వహించనున్నారు. BSFకి చెందిన 144 మంది మహిళా కానిస్టేబుల్స్‌ కర్తవ్య్ పథ్‌లో మార్చ్ చేయనున్నారు. ఇప్పటికే ఢిల్లీ పోలీసులు సిటీ అంతా నిఘా పెట్టారు. భద్రత కట్టుదిట్టం చేశారు. అక్షరధామ్‌లో మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. ఉగ్రవాదులు దాడి చేస్తే ఎలా ఎదుర్కోవాలో డ్రిల్ చేశారు. భద్రతా బలగాలన్నీ అప్రమత్తమయ్యాయి. 28 రాష్ట్రాలతో పాటు 8 కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 2,274 క్యాడెట్స్ రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొననున్నాయి. ఈ సారి భారీ సంఖ్య బాలికలే ఈ క్యాడెట్‌లలో కనిపించనున్నారు. 


పొగమంచు, ఇతరత్రా సాంకేతిక కారణాలతో దేశ వ్యాప్తంగా పలు ఎయిర్ పోర్ట్‌లలో విమాన సర్వీసులకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. విమానాల ఆలస్యం, రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ ప్రయాణికుడు విమాన కెప్టెన్ పై సైతం దాడి చేయడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. దేశంలోని 6  మెట్రో నగరాల్లో ‘వార్‌ రూమ్స్‌’ (War Rooms At Airports) ఏర్పాటు చేయనున్నట్లు పౌర విమానయాన శాఖ ప్రకటించింది. ఇప్పటికే విమానాల ఆలస్యంపై ఎయిర్‌లైన్లకు పలు మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చూసేందుకు తాజాగా మరికొన్ని చర్యలు చేపట్టింది. తెలిసిందే. ప్రతికూల వాతావరణం కారణంగా 3 గంటలకు మించి లేట్ అవుతుందనుకుంటే ఆ విమానాన్ని ముందస్తుగా రద్దు చేయవచ్చని అన్ని ఎయిర్ లైన్స్‌కు డీజీసీఏ స్పష్టం చేసింది.


కేంద్రం తాజాగా ప్రకటించిన మార్గదర్శకాలివే (Standard Operating Procedures)
- దేశంలో రద్దీ అధికంగా ఉండే 6 మెట్రో ఎయిర్‌పోర్టులైన ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరులలో జరిగే సంఘటలను ప్రతిరోజూ మూడుసార్లు కేంద్రానికి రిపోర్ట్ చేయాలి.
- డీజీసీఏ మార్గదర్శకాలు, నిబంధనల అమలును నిరంతరం పర్యవేక్షిస్తారు. వీటి ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనునన్న కేంద్రం 
- పైన పేర్కొన్న 6 మెట్రో ఎయిర్ పోర్టులలో ఎయిర్‌లైన్‌ ఆపరేటర్లు ‘వార్‌ రూమ్స్‌’ను ఏర్పాటు చేయాలి. ఈ వార్ రూమ్స్ ఆ విమానాశ్రయంలో ప్రయాణికులకు కలిగే అసౌకర్యం, సమస్యలకు తక్షణ పరిష్కారాన్ని చూపిస్తాయి. 
- ఎయిర్ పోర్టుల్లో 24 గంటలపాటు తగినంత సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందిని అందుబాటులో ఉండేలా చూస్తామని ప్రకటన 


Also Read: Ayodhya Ram Mandir News: అయోధ్య రాముడి కోసం బాహుబలి అగరబత్తి- తయారీకి ఎంతగా శ్రమించారంటే!