Pradhanmantri Suryoday Yojana: అయోధ్య రామాలయంలో ప్రాణప్రతిష్ఠ అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ కొత్త పథకాన్ని ప్రకటించారు. "ప్రధానమంత్రి సూర్యోదయ యోజన" (Pradhanmantri Suryoday Yojana) పేరుతో ఓ కొత్త విషయం చెప్పారు. దీని కింద దేశంలోని ఒక కోటి ఇళ్లపై రూఫ్‌టాప్ సోలార్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేసి తెలియజేశారు. “ప్రపంచంలోని భక్తులందరూ ఎల్లప్పుడూ సూర్యవంశానికి చెందిన భగవంతుడు శ్రీరాముడి నుంచి శక్తిని పొందుతారు. ఈరోజు, అయోధ్యలో పవిత్ర ప్రతిష్ఠాపన సందర్భంగా భారతదేశంలోని ప్రజలు తమ ఇళ్ల పైకప్పుపై సొంత సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్‌ను కలిగి ఉండాలనే నా సంకల్పం మరింత బలపడింది.


అయోధ్య నుంచి తిరిగి వచ్చిన తర్వాత నేను తీసుకున్న మొదటి నిర్ణయం ఏమిటంటే.. మా ప్రభుత్వం ఒక కోటి ఇళ్లపై రూఫ్‌టాప్ సోలార్‌ను ఏర్పాటు చేసే లక్ష్యంతో ‘ప్రధానమంత్రి సూర్యోదయ యోజన’ని ప్రారంభించనుంది. ఇది పేద, మధ్యతరగతి ప్రజల విద్యుత్ బిల్లును తగ్గించడమే కాకుండా, ఇంధన రంగంలో భారతదేశాన్ని స్వావలంబనగా చేస్తుంది’’ అని నరేంద్ర మోదీ ఎక్స్ లో పోస్ట్ చేశారు.


సోమవారం (జనవరి 22) అయోధ్యలోని రామాలయంలోని గర్భగుడిలో శ్రీరాంలల్లా నూతన విగ్రహ ప్రతిష్ఠాపన పూర్తయిన సంగతి తెలిసిందే. దీనికి దేశ విదేశాలలో లక్షలాది మంది రామభక్తులు ప్రత్యేక పూజలలో పాల్గొని, అతీంద్రియ ఘట్టమని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు.


ఈ సందర్భంగా కొత్తగా నిర్మించిన రామ మందిరంపై ఆర్మీ హెలికాప్టర్లు పూల వర్షం కురిపించాయి. దీంతో ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య శోభాయమానంగా వెలిగిపోయింది. ప్రజలు నృత్యాలు మరియు పాటలు చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ ఆలయం మంగళవారం నుంచి సామాన్య ప్రజల కోసం తెరచి ఉంచుతారు. ఈ సందర్భంగా, ప్రధాని మోదీ ఎక్స్ పోస్ట్‌లో.. “అయోధ్య ధామ్‌లో శ్రీ రామ్‌లాలా అతీంద్రియ ఘట్టం ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురి చేస్తుంది. ఈ దివ్య కార్య‌క్ర‌మంలో భాగ‌స్వామ్య‌మైనందుకు చాలా ఆనందంగా ఉంది. హాయ్ సియా రామ్!" అని పోస్ట్ చేశారు.