PM Modi Address LIVE: 'మేడ్ ఇన్ ఇండియా' మంత్రం.. ఐకమత్యంతోనే సాధ్యం: మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ 100 కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీపై జాతినుద్దేశించి ప్రసంగిస్తున్నారు.
ABP Desam Last Updated: 22 Oct 2021 10:29 AM
Background
ప్రధాని నరేంద్ర మోదీ కాసేపట్లో జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు మోదీ ప్రసంగించనున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ 100 కోట్ల మైలురాయిని దాటినందున మోదీ ఈ విషయంపై ప్రసంగించే అవకాశం ఉంది.కరోనాపై...More
ప్రధాని నరేంద్ర మోదీ కాసేపట్లో జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు మోదీ ప్రసంగించనున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ 100 కోట్ల మైలురాయిని దాటినందున మోదీ ఈ విషయంపై ప్రసంగించే అవకాశం ఉంది.కరోనాపై యుద్ధంలో భారత్ సాధించిన అరుదైన ఘనతపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. 100 కోట్ల టీకా డోసులను పంపిణీ చేసి భారత్ నవచరిత్ర లిఖించిందన్నారు." భారత్ నవ చరిత్రను లిఖించింది. 130 కోట్ల మంది భారతీయుల ఆత్మవిశ్వాసానికి, ఐకమత్యానికి ఇది ప్రతీక. భారత శాస్త్రవేత్తల కృషికి ఇది ప్రతిఫలం. 100 కోట్ల టీకా డోసుల పంపిణీ చేసినందుకు దేశానికి శుభాకాంక్షలు. ఈ ఘనత సాధించినందుకు వైద్యులు, నర్సులకు నా కృతజ్ఞతలు. "-ప్రధాని నరేంద్ర మోదీఈ సందర్భంగా నిన్న ప్రధాని మోదీ దిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి వెళ్లారు. అక్కడి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు.భారత్ సాధించిన మైలురాయికి గుర్తుగా కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ వ్యాక్సినేషన్‌పై ఓ ప్రత్యేక గీతాన్ని విడుదల చేశారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
మేడ్ ఇన్ ఇండియా..
ఇప్పటివరకు ఆ దేశం ఇది తయారు చేసింది, ఈ దేశం ఇది తయారు చేసింది అని విన్నాం. కానీ ఇక ఏది చూసినా 'మేడ్ ఇన్ ఇండియా' అని ఉండటం చూస్తున్నాం. ఇది భారత్ సాధించిన ఘనత
- ప్రధాని నరేంద్ర మోదీ