Piyush Goyal is worried about Amazon 1 bn investment in India : భారత్‌లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తే గొప్పగా చెబుతూంటారు. మన ముఖ్యమంత్రులు ఇతర రాష్ట్రాలకు వెళ్లి పెద్ద ఎత్తున పెట్టుబడులు సాధించకొచ్చామని చెబుతూంటారు. అయితే అన్నీ మంచి పెట్టుబడులు కావని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ చెబుతున్నారు. అమెజాన్ ఇటీవల ఇండియాలో ఒక బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది. అయితే ఇదేమీ సంతోషించదగ్గ విషయం కాదని ఆయన చెబుతున్నారు. అమెజాన్ నష్టాలను భర్తీ చేసుకోవడానికే ఇలా పెట్టుబడులు పెడుతోందని.. అంటున్నారు. నష్టాలు వస్తున్నా సరే ఇలా పెట్టుబడులు పెట్టడం వెనుక దీర్ఖ కాలంలో మన భారతీయ రీటైలర్ల ఉపాధిని దెబ్బతీసే కోణం ఉందని ఆయన అభిప్రాయపడుతున్నారు.
ఈ కామర్స్ వృద్ధి మంచి చేయదనే భావనలో వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్
ఒక్క అమెజాన్ అనే కాకుండా మొత్తం ఈ కామర్స్ వ్యాపారం గణనీయంగా పెరగడంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల మన దేశంలోని చిన్న చిన్న వ్యాపారాలు అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటారని ఆయన అంటున్నారు. ఇప్పటికే అమెజాన్‌తో పాటు ఎన్నో ఈ కామర్స్ కంపెనీలు వచ్చాయి. ప్రతి విభాగానికి ఓ ప్రత్యేకమైన ఈ కామర్స్ స్టార్టప్ లు వసస్తున్నాయి. నిత్యావసర వస్తువుల్నిపది నిమిషాల్లో డెలివరీ చేసే స్టార్టప్‌లు వచ్చాయి. ఇక వాహనాలను కూడా ఆమెజాన్ విక్రయిస్తోంది. ఇలా చెప్పుకూంటూ పోతే .. ఇంటి నుంచి బయటకు వెళ్లే అవసరం లేకుండా ప్రతి ఒక్కటి కొనుగోలు చేసే పరిస్థితి వచ్చింది.
చిన్న వ్యాపారుల ఉపాధి అవకాశాలను భారీగా దెబ్బతీస్తున్నారా ?
ఇది భారతీయుల ఆత్మను దెబ్బతీస్తుందని.. పీయూష్ గోయల్ ఆందోళన. నిజంగానే భారత్ లో ప్రతీ వీధిలోనూ దుకాణాలు ఉంటాయి. ఇళ్ల మధ్య కూడా దుకాణాలు ఉంటాయి. చిల్లర దుకాణాలతో లక్షల మంది భారతీయులు ఉపాధి పొందుతూ ఉంటారు. ఈకామర్స్ సైట్ల విజృంభణ తర్వతా చిన్న చిన్న రిటైల్ దుకాణాలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయన్న అెభిప్రాయాలు వినిపిస్తున్నాయి. చాలా మంది దుకాణాలు మూసి వేసి ఇతర పనుల్లో చేరిపోతున్నారు. ఫర్నీచర్ తయారీ పనులు సొంతంగా చేపట్టే వారు.. ఈ కామర్స్ సైట్లు పెరిగిన తర్వాత ఆర్డర్స్ లేకపోవడంతో... ఆయా కంపెనీల్లో ఉద్యోగానికి చేరిపోతున్నారు. ఇలా అనేక రంగాల్లో ప్రభావం కనిపిస్తోంది.
ఉద్యోగాలు సృష్టిస్తున్నాయని మరికొందరి వాదన
పీయూష్ గోయల్ అదే చబుతున్నారు. అమెజాన్ లాంటి కంపెనీలు ఎన్ని బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టినా అంత సంతోషకరమైన విషయం కాదని విశ్లేషిస్తున్నారు. ఓ రకంగా పీయూష్ గోయల్ ఆలోచన కరెక్టే అయినా.. ఈ కంపెనీలు లక్షల ఉద్యోగాలను సృష్టిస్తున్నాయని మరో కోణం కూడా ఆవిష్కరించేవారు ఉన్నారు. అయితే ఇప్పుడు డిస్కౌంట్ రేట్లకు అమ్మి.. చిన్న చిన్న దుకాణాలు లేని ప్రత్యామ్నాయ పరిస్థితులు ఏర్పడిన తర్వాత అమెజాన్ లాంటి కంపెనీలు లాభాల కోసం దోపిడీకి పాల్పడాయని..అందుకే పీయూష్ గోయల్.. ఆందోళన వ్యక్తం చేస్తున్నారని భావిస్తున్నారు.