iPhones Hacking :  దేశంలో మరో సారి ఫోన్ ట్యాపింగ్ కలకలం రేగింది. ప్రతిపక్ష నేతలకు చెందిన ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. యాపిల్ ఫోన్ కంపెనీల నుంచి త‌మ‌కు వార్నింగ్ మెసేజ్‌లు వ‌చ్చిన‌ట్లు పలువురు ఎంపీలు పేర్కొన్నారు. ప్ర‌తిప‌క్షాల‌కు చెందిన పార్టీ నేత‌లు   ఆ ఆరోప‌ణ‌లు చేశారు. తృణ‌మూల్ ఎంపీ మ‌హువా మొయిత్రా, కాంగ్రెస్ నేత ప్రియాంకా చ‌తుర్వేది, శ‌శి థ‌రూర్‌, ప‌వ‌న్ ఖేరా, ఆప్ ఎంపీ రాఘ‌వ చ‌ద్దా, ఎంఐఎం ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ .. త‌మ ఫోన్లు హ్యాక్ అవుతున్న‌ట్లు తెలిపారు. ప్ర‌భుత్వంతో లింకున్న‌ సైబ‌ర్ నేర‌గాళ్లు త‌మ ఫోన్ల‌ను హ్యాక్ చేసే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు త‌మ‌కు మెసేజ్‌లు వ‌స్తున్న‌ట్లు ఆ ఎంపీలు  ఆరోపించారు. 


తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా, శివసేన (యూబీటీ) నాయకురాలు ప్రియాంక చతుర్వేది, కాంగ్రెస్ నేతలు పవన్ ఖేరా, శశి థరూర్‌లతో సహా పలువురు ప్రతిపక్ష నాయకులు తమ ఫోన్‌లు, మెయిల్‌లకు యాపిల్ నుంచి హెచ్చరిక సందేశాలు వచ్చాయని ఆరోపించారు. వారి ఐఫోన్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ తరహా చర్యలు జరిగినట్టు వారు తెలిపారు. కాంగ్రెస్ నేతలు పవన్ ఖేరా, శశి థరూర్, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు రాఘవ్ చద్దా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తదితరులతో సహా ప్రతిపక్ష భారత కూటమికి చెందిన ఇతర నేతలపై మెుయిత్రా ట్వీట్‌లో ఆరోపించారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కార్యాలయానికి కూడా యాపిల్ నుంచి హెచ్చరిక సందేశాలు వచ్చాయి.





  


ఎంపీల‌కు చెందిన ఐఫోన్ల‌ను హ్యాక‌ర్లు టార్గెట్ చేస్తున్న‌ట్లు యాపిల్ సంస్థ కొంద‌రికి వార్నింగ్ మెసేజ్‌ల‌ను పంపింది.ఎంఐఎం ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ త‌న ఎక్స్ అకౌంట్‌లో ఆ సైబ‌ర్ అటాక్ మెసేజ్‌ను షేర్ చేశారు. త‌న ఫోన్‌ను టార్గెట్ చేస్తున్నార‌ని గ‌త రాత్రి యాపిల్ సంస్థ‌ నోటిఫికేష‌న్ పంపిన‌ట్లు ఆయ‌న తెలిపారు. ఆ మెసేజ్‌కు చెందిన స్క్రీన్ షాట్‌ను ఎంపీ ఓవైసీ త‌న ఎక్స్ అకౌంట్‌లో షేర్ చేశారు. యాపిల్ ఫోన్ల త‌యారీ సంస్థ నుంచి త‌మ‌కు బెదిరింపు మెయిల్స్ వ‌చ్చిన‌ట్లు ఇవాళ ఆరుగురు ఎంపీలు ఆరోపించారు.   





 


ప్ర‌భుత్వం త‌న ఫోన్‌ను, మెయిల్‌ను హ్యాక్ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు ఎంపీ మ‌హువా త‌న ఎక్స్ అకౌంట్‌లో ఆరోపించారు. ఆమె కూడా త‌న వార్నింగ్ మెసేజ్ స్క్రీన్ షాట్‌ను షేర్ చేశారు. ఈ అంశంలో చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కేంద్ర హోం శాఖకు లేఖ రాసిన‌ట్లు ఆమె చెప్పారు. ప్రివిలేజ్ క‌మిటీ ఈ అంశాన్ని చ‌ర్చించాల‌ని ఆమె డిమాండ్ చేశారు.