Air India Pee Case: 


ప్రత్యేక సాఫ్ట్‌వేర్ 


ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో మహిళపై ఓ వ్యక్తి యూరినేట్ చేసిన ఘటనలో విచారణ ఓ కొలిక్కి వచ్చింది. కానీ...ఆ కంపెనీ మాత్రం ఈ అంశాన్ని చాలా తీవ్రంగా పరిగణించింది. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపడుతోంది. సాఫ్ట్‌వేర్ ఆధారంగా విమానంలో జరిగే అన్ని యాక్టివిటీస్‌పైనా నిఘా పెట్టేందుకు సిద్ధమైంది. పొరపాటున ఇలాంటి సంఘటనలు జరిగితే...అందుకు సంబంధించిన సమాచారం అంతా సాఫ్ట్‌వేర్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఎయిర్ ఇండియాలోని ప్రతి అధికారికీ అందుకు సంబంధించిన అన్ని వివరాలు ఆ సాఫ్ట్‌వేర్‌ ద్వారా తెలుసుకునే వీలుంటుంది. పారిస్ నుంచి ఢిల్లీ వస్తున్న ఫ్లైట్‌లో ఓ వ్యక్తి మద్యం మత్తులో మహిళపై యూరినేట్ చేసిన ఘటన వివాదాస్పదమైంది. సిబ్బంది ఎంత చెప్పినా ఆ వ్యక్తి వినలేదని ప్రాథమిక విచారణలో తేలింది. ఆ తరవాత చాలా రోజుల పాటు పరారీలో ఉన్న నిందితుడుని బెంగళూరులో అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై డీజీసీఏ చర్యలు తీసుకుంది. ఎయిర్ ఇండియాకు 30 లక్షల రూపాయల జరిమానా విధించింది. ఆ ఘటన న్యూయార్క్‌ ఢిల్లీ విమానంలోని పైలట్ లైసెన్సును మూడు నెలల పాటు సస్పెండ్ చేసింది. తన విధులు నిర్వర్తించడంలో విఫలం అయినందుకు విమానాల్లో సేవలను పర్యవేక్షించే డైరెక్టర్ కు 3లక్షల రూపాయల ఫైన్ విధించింది. 
ఆరోపణలకు సంబంధించి ఎయిర్ ఇండియా.. ప్రత్యేకంగా విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. నాలుగు నెలల పాటు శంకర్ మిశ్రా ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణించకుండా నిషేధం విధించింది. ఇదిలా ఉండగా.. జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న నిందితుడు శంకర్.. తాను 
ఎలాంటి తప్పు చేయలేదని ఇటీవల కోర్టులో తన వాదనను వినిపించాడు. ఈ కేసులో తాను నిందితుడిని కాదని.. ఆ మహిళే మూత్ర విసర్జన చేసుకుని ఉంటుందని చెప్పాడు. ఆమె ప్రొస్టేట్ కు సంబంధించిన సమస్యలతో బాధపడుతోందని... అలాంటి వారు ఇలా చేసుకోవడం 
సహజమేనని చెప్పారు. కానీ తాను మాత్రం ఆమెపై మూత్ర విసర్జన చేయలేదని అతడు కోర్టుకు సమర్పించిన సమాధానంలో పేర్కొన్నాడు.


డ్రింక్స్‌ సర్వ్ చేయొచ్చా..? 


విమానాల్లో డ్రింక్స్‌ని సర్వ్ చేయొచ్చా లేదా అన్న ఆలోచనలో పడ్డాయి యాజమాన్యాలు. దీనిపైనే సర్వే చేయగా...ఓ ఆసక్తికర విషయం వెల్లడైంది. దాదాపు 48% మంది ప్రయాణికులు విమానాల్లో మద్యం ఇవ్వడాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు. 89% మంది మాత్రం 
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పక్కా సెక్యూరిటీ కల్పించాలని అడిగారు. కమ్యూనిటీ సోషల్ మీడియా  ప్లాట్‌ఫామ్‌ అయిన  LocalCircles ఈ సర్వే చేపట్టింది. మద్యం సేవించి విమానం ఎక్కకుండా ముందుగానే ప్రయాణికుల నుంచి అండర్‌టేక్ తీసుకోవాలని 50% మంది అభిప్రాయం వెల్లడించారు. ఇక...వెంట తెచ్చుకున్న ఆల్కహాల్‌ను విమానంలో తాగకుండా ఆంక్షలు విధించాలని 32% మంది కోరారు. మరో 40% మంది ఆసక్తికర విషయం చెప్పారు. విమానం ఎక్కే ముందే బ్రీత్ అనలైజర్‌తో టెస్ట్ చేసి...ఆ రిజల్ట్ ఆధారంగా విమానం ఎక్కాలా వద్దా అన్నది తేల్చాలని చెప్పారు. గతేడాది నవంబర్, డిసెంబర్‌ నెలల్లో వరుసగా విమానాల్లో ఇబ్బందికర ఘటనలు జరిగాయి. 


Also Read: 2002 Gujarat Riots: గుజరాత్ అల్లర్ల డాక్యుమెంటరీపై నిషేధాన్ని సవాలు చేస్తూ పిటిషన్ - విచారణకు సుప్రీంకోర్టు ఓకే