SpiceJet News: SpiceJet విమానంలో ఓ ప్రయాణికుడికి వింత అనుభవం ఎదురైంది. ముంబయి నుంచి బెంగళూరుకి వెళ్తున్న ఫ్లైట్‌లో ఓ ప్యాసింజర్‌ వాష్‌రూమ్‌కి వెళ్లి దాదాపు గంటపాటు అందులోనే ఇరుక్కున్నాడు. డోర్‌ లాక్‌ పడిపోయి ఎంతకీ తెరుచుకోకపోవడం వల్ల లోపలే ఉండిపోవాల్సి వచ్చింది. ముంబయిలో టేకాఫ్ అయిన సమయంలో టాయిలెట్‌లోకి వెళ్లాడు. ఆ తరవాత డోర్‌ తీసేందుకు ప్రయత్నించాడు. అది లాక్‌ అయిపోయింది. ఎంత సేపు ప్రయత్నించినా అది తెరుచుకోలేదు. ఫ్లైట్ సిబ్బంది కూడా ప్రయత్నించినా ఏమీ చేయలేకపోయారు. బెంగళూరులో ల్యాండ్ అయిన తరవాత టెక్నీషియన్ వచ్చి డోర్‌ తెరిచాడు. అప్పుడు కానీ ఆ ప్యాసింజర్ ఊపిరి పీల్చుకోలేదు. ఈ ఘటనపై స్పైస్‌జెట్‌ క్షమాపణలు చెప్పింది. ఆ ప్యాసింజర్‌కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకున్నామని వెల్లడించింది. 


"జనవరి 16న దురదృష్టవశాత్తూ ఓ ప్రయాణికుడు టాయిలెట్‌లో ఇరుక్కుపోయాడు. దాదాపు గంటసేపు అందులోనే ఉండిపోయాడు. ముంబయి నుంచి బెంగళూరుకి వెళ్తున్న ఫ్లైట్‌లో ఈ ఘటన జరిగింది. డోర్‌ లాక్‌ సరిగ్గా పని చేయలేదు. స్ట్రక్ అయిపోయింది. అందుకే ప్యాసింజర్‌ ఇబ్బంది పడ్డారు. కానీ...మా సిబ్బంది ఆయన అసౌకర్యానికి గురి కాకుండా అన్ని విధాలుగా సహకారం అందించింది. బెంగళూరులో ల్యాండ్ అయిన తరవాత ఓ ఇంజనీర్ వచ్చాడు. లాక్‌ ఓపెన్ చేశాడు. ఆ ప్రయాణికుడికి అవసరమైన మెడికల్ అసిస్టెన్స్ అందించాం. ఇలా జరిగినందుకు మరోసారి క్షమాపణలు చెబుతున్నాం"


- స్పైస్‌జెట్‌