Parliamentary committee has issued notices to Meta chief Zuckerberg: 2024 ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిందా.. గెలిచిందా.?. ఇదేం పిచ్చి ప్రశ్న గెలవబట్టే కదా ప్రధానిగా మోదీ మూడో సారి ప్రమాణం స్వీకారం చేశారు.. అని మనకు అనిపిస్తుంది. కానీ ఫేస్ బుక్ ఓనర్ మార్క్ జుకర్ బెర్గ్ మాత్రం భారత్ లో గత ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిందని అంటున్నారు.ఆయన మాటలు వైరల్ కావడంతో.. భారత ప్రభుత్వం మండిపడింది. భారత్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ బీజేపీ ఓడిపోయిందని ఆయన ప్రచారం చేయడాన్ని సీరియస్‌గా తీసుకుంది. పార్లమెంటరీ కమిటీ ఆయనకు నోటీసులు జారీ చేసింది.
Also Read : Los Angeles Wildfire : లాస్ ఏంజిల్స్ అగ్ని ప్రమాదం - ఆ రాష్ట్రాల బడ్జెట్ కంటే విలువైన ఆస్తి నష్టం
నిజానికి ఇండియాలో అధికార పార్టీగా ఉన్న బీజేపీ మరోసారి విజయం సాధించింది. ఎన్డీఏ కూటమిగా రంగంలోకి దిగి విజయాన్ని అందుకుంది. మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. జుకర్ బెర్గ్ కు ఈ విషయంలో అవగాహన లేనట్లుగా భావిస్తున్నారు. అయితే బీజేపీ పూర్తి మెజార్టీ సాధించలేకపోవడం వల్ల ఓడిపోయిందని ఆయన తనకు తాను నిర్ణయించుకున్నారన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. జుకర్ బెర్గ్ ఈ నోటీసులపై ఎలా స్పందిస్తారో కానీ.. ఆయన అధికార పార్టీ ఓడిపోయిందని చెప్పిన విషయం హైలెట్ అవుతోంది.
నిజానికి బీజేపీని సింగల్ గా సీట్ల పరంగా చూస్తే.. పరాజయం కిందే లెక్క అనుకోవచ్చు. అయితే టెక్నికల్ గా కాదు. కూటమిగ పార్టీలన్నీ కలసి పోటీ చేశాయి కాబట్టి ఎన్డీఏనే మళ్లీ విజయం సాధించింది. తన కామెంట్లకు జుకర్ బెర్గ్ ఎలాంటి వివరణ ఇస్తారో కానీ.. పార్లమెంటరీ కమిటీ మాత్రం నోటీసులు జారీ చేసింది.
Also Read: కొత్త బంగారు గని పాక్ కష్టాలను గట్టెక్కిస్తుందా? - లేక ఆఫ్రికా పరిస్థితే దీనికి కూడా వస్తుందా!