Pakistani MPs are severely criticizing the Pakistani Prime Minister:  పాకిస్తాన్ పార్లమెంట్‌లో ప్రధానమంత్రి  షాబాజ్ షరీఫ్ పై ఎంపీలు, ముఖ్యంగా విపక్ష సభ్యులు, తీవ్ర విమర్శలు చేస్తున్నారు.  ఒక పాకిస్తానీ ఎంపీ షాబాజ్ షరీఫ్‌ను "బుజ్దిల్"   అని సంబోధించి, భారత ప్రధాని నరేంద్ర మోదీ పేరు చెప్పడానికి కూడా భయపడుతున్నారని  విమర్శించారు. బుజ్జిల్ అంటే పిరికివాడు అని అర్థం.  భారత్  దాడుల తర్వాత పాకిస్తాన్ సైన్యం నిరుత్సాహంగా ఉందని ఆరోపించారు షాబాజ్ నాయకత్వంలో ధైర్యం లేదని, దేశాన్ని సమర్థవంతంగా నడపలేరని మండిపడుతున్నారు.   "మోదీ ముందు నిలబడలేని వ్యక్తి"గా  వారు అభివర్ణించారు.  

భారత్  సైనిక చర్యలకు షాబాజ్ షరీఫ్  సరైన స్పందన ఇవ్వలేదని విమర్శలు వచ్చాయి. పాకిస్తాన్ సైన్యం,  షాబాజ్ నాయకత్వం భారత దాడులను నిరోధించలేకపోయాయని, దేశ రక్షణ వ్యవస్థలు విఫలమయ్యాయని  ఒక ఎంపీ ఆరోపించారు. పాకిస్తాన్ సైన్యం  "వేగవంతమైన స్పందన"ను షాబాజ్ ప్రశంసించినప్పటికీ, ఎంపీలు మాత్రం తోసిపుచ్చారు. ప్రధాని ప్రకటన ప్రకటనలను బలహీనంగా, నమ్మకం లేనిదిగా ఉందన్నారు.  

 షాబాజ్ షరీఫ్  నెమ్మదిగా, సంకోచపూరితంగా మాట్లాడుతూండటాన్ని సామాజిక మాధ్యమాల్లో పాకిస్తాన్ పౌరులు విమర్శిస్తున్నారు.  ఎంపీలు అతన్ని "నీటిలో తడిసిన పిల్లిలా కనిపిస్తున్నాడు" అని   "యుద్ధం ముగిసినా అతని ప్రసంగం ముగియదు" అని  సెటైర్లు వేస్తున్నారు. 

  ఒక ఎంపీ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌ను "పేకాట రాయుడు" అని సంబోధించి, షాబాజ్ షరీఫ్ నాయకత్వంలో సైన్యం సమర్థవంతంగా పనిచేయడం లేదని ఆరోపించారు. షాబాజ్ ప్రభుత్వం ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించడంలో విఫలమైందని, ద్రవ్యోల్బణం సంక్షోభాన్ని నియంత్రించలేకపోయిందని ఎంపీలు విమర్శించారు.  సోషల్ మీడియా నిషేధాలు మ, టర్నెట్ ఫైర్‌వాల్ వంటి నిర్ణయాలు వ్యాపారాలను దెబ్బతీశాయని, సెన్సార్‌షిప్‌ను ప్రోత్సహిస్తున్నాయని ఆరోపణలు వచ్చాయి.