Pakistan social media:  భారత్ చేసిన దాడులతో మైండ్ బ్లాంక్ అయిన పాకిస్తాన్‌కు తమ దేశ ప్రజలకు ఎలా సమాధానం చెప్పాలో తెలియడం లేదు. అయితే సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వేసి..  తాము కూడా దాడి చేశామని అనిపించేందుకు ప్రయత్నిస్తున్నారు.  నమ్మించేందుకు తంటాలు పడుతున్నారు. 

భారత ఫైటర్ జెట్లు.. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ లో దాడులు చేసి..సురక్షితంగా తిరిగి వచ్చాయి. అయితే రెండు పైటర్ జెట్లను పాకిస్తాన దళాలు కల్చివేశాయని ప్రచారం చేసుకుంటున్నాయి పాకిస్తానీ మీడిాయా. పాత ఫేక్ ఫోటోలను ఇందుకు వాడుకుంటున్నారు. 

అలాగే శ్రీనగర్ ఎయిర్ బేస్ పై కూడా దాడి చేసినట్లుగా చెప్పుకున్నారు. సరిహద్దుల్లో  కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి అమాయక ప్రజల్ని కాల్చి చంపడం తప్ప పాకిస్తాన్ ఏమీ చేయలేకపోతోంది.  కానీ ఫేక్ పోస్టులకు మాత్రం తగ్గడం లేదు.  

తమ సైన్యం వీరోచితంగా పోరాడుతోందని.. చివరికి  వీడియో గేమ్ దృశ్యాలను కూడా పోస్టు చేసుకుంటున్నారు పాకిస్తానీయులు. 

ఎప్పుడో జరిగి న వాటి దృశ్యాలను తీసుకుని ఇప్పుడే.. మా పరాక్రమమే అని పాకిస్తాన్ చెప్పుకుంటోంది. 

భారత సైన్యం చేసిన దాడులతో పాకిస్తాన్ ఘోరంగా నష్టపోయిందన్నది బహిరంగ నిజం. భారత్ కు చిన్న నష్టం కూడా చేయలేదు. అయితే తమ ప్రజలు తిడుతారని.. పరువు పోతుందని ఫేక్ న్యూస్‌తో ఇలా సర్దుబాటు చేస్తున్నారు.